Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా మారుతోంది. జనవరి నాటికి పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చనే హెచ్చరిక జారీ అయింది.
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి ప్రతాపం చూపిస్తోంది. నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ థర్డ్‌వేవ్ ప్రమాదం ముంచుకొస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారుతోంది. దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలోనే (Maharashtra)నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో అత్యధికంగా 510 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. జనవరి మూడవ వారం నాటికి అంటే సంక్రాంతి పండుగ ముగిసేసరికి రాష్ట్రంలో 2 లక్షల కోవిడ్ కేసులు నమోదు కావచ్చని అడిషనల్ ఛీఫ్ సెక్రటరీ డాక్టర్ ప్రదీప్ వ్యాస్ చేసిన హెచ్చరిక ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 9 వేల 170 కరోనా కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. అటు ఏడుగురు కరోనా కారణంగా మరణించారు. గత 11 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోయాయి.
ఒమిక్రాన్ (Omicron) ప్రమాదకారి కాదని..అయినా ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని డాక్టర్ ప్రదీప్ వ్యాస్ సూచించారు. వ్యాక్సిన్ తీసుకోనివారికి మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ ప్రాణాంతకం కావచ్చని అంటున్నారు. తక్షణం వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెళ్లిళ్లు, సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, అంత్యక్రియల విషయంలో ఆంక్షలు విధించింది. ఈ తరహా కార్యక్రమాలకు గరిష్టంగా 50 మందికి మించకూడదు. అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కాకూడదు.
Also read: Omicron scare: కేరళలో కరోనా కలకలం- ఒక్క రోజులో 45 ఒమిక్రాన్, 2,802 కొవిడ్ కేసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook