Godavari Flood: గోదావరికి పోటెత్తుతున్న వరద, భద్రాచలంలో తొలి ప్రమాద హెచ్చరిక
Godavari Flood: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. అప్పుడే భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
Godavari Flood: గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరికి వరద నీరు ముంచెత్తుతోంది. గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు మీ కోసం..
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీరు భారీగా పెరుగుతోంది. గోదావరికి ఎర్రనీరు వచ్చి చేరింది. ఇవాళ సాయంత్రానికే భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో పట్టణంలో పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రామాలయం చుట్టూ వరద నీరు చేరుకుంది. అదే సమయంలో ధవళేశ్వరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది.
గోదావరి వరద ఉధృతి కారణంగా కోనసీమ జిల్లా పి గన్నవరం గంటి పెదపూడిలో గట్టు తెగిపోయి నాలుగు గ్రామాలకు రాకపోకలు స్థంబించాయి. దాంతో గంటి, పెదపూడి, బురుగులంక, అరిగెలవారి పాలెం, పెదలంక గ్రామాల ప్రజలకు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇటు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు వద్ద గోదావరి వరద ఉధృతితో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఓ వైపు భారీ వర్షాలు, మరోవైపు గోదావరి వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో వదులుతున్నారు. భారీ వర్షాల నేపధ్యంంలో తెలంగాణలో రేపు, ఎల్లుండి రెండ్రోజులు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ఈ పరిస్తితి తలెత్తింది.
Also read:: UAE Hindu Temple: ముస్లిం దేశం యూఏఈలో తొలి హిందూ దేవాలయం ఇదే, ఎప్పుడు ప్రారంభమంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook