స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి
బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Price Today) స్వల్పంగా పెరగగా, వెండి ధరలు మాత్రం భారీగా పెరిగి షాకిచ్చాయి. అయితే ఆల్ టైమ్ గరిష్ట ధరలను మాత్రం వెండి టచ్ చేయలేకపోయింది. బంగారం సైతం ఓ మోస్తరు ధరలకే పరిమితమైంది.
బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) అతి స్వల్పంగా పెరిగాయి. అయితే వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. హైదరాబాద్,(Gold Pricce In Hyderabad) విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.60 మేర స్వల్పంగా బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,710కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,570 వద్ద ట్రేడ్ అవుతోంది. కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీకి భారీ సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్
ఢిల్లీలో నేటి మార్కెట్‌లో అతి స్వల్పంగా రూ.10 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,460గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,260 వద్ద మార్కెట్ అవుతోంది. ఆగస్టులో Niharika నిశ్చితార్థం, కాబోయే భర్తతో నిహారిక ఫొటోలు వైరల్
జూన్ తొలి వారంలో బులియన్ మార్కెట్‌లో గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ఆపై ఓ మోస్తరు ధరలకు పరిమితమైంది. నేడు వెండి ధర కేవలం రూ.500 మేర భారీగా పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.48,050కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ