బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం (Gold Rate Today), వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం ఊహించనంతగా ఎగసి, ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.830 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,200 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.760 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,850 వద్ద ట్రేడ్ అవుతోంది. YouTube Star పెద్ద మనసు.. బాధితులకు భారీ సాయం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate Today In Delhi) భారీగా పెరిగాయి. నేటి మార్కెట్‌లో రూ.850 పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,950 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,750కి ఎగసింది. Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు


నేడు వెండి ధర రూ.3,550 మేర భారీగా పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి ఆల్‌టైమ్ గరిష్ట ధరల్ని నమోదు చేసింది. తాజాగా 1 కేజీ వెండి ధర ధర రూ.58,950కి ఎగసింది. మార్కెట్‌లో ఇప్పటివరకూ ఇదే ధర అత్యధికం. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు  
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్