బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా నాలుగోరోజు సైతం పసిడి ధరలు తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా ధర దిగొచ్చింది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.600 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,870 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.550 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,550కి క్షీణించింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా నాలుగోరోజు పతనమయ్యాయి. తాజాగా రూ.720 మేర భారీగా ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,740కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.650 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,350 అయింది. 



వెండి ధర (Silver Rate in India) గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.2,000 మేర భారీగా తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.57,000కి పతనమైంది. కేవలం ఈ వారం రూ.11,000 మేర ధర దిగిరావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద ట్రేడ్ అవుతుంది.  



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe