బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం పసిడి ధరలు భారీగా తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా ధర దిగిరాగా, తాజాగా స్థిరంగా ధరలు మార్కెట్ అవుతున్నాయి. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర శనివారం సాయంత్రం రూ.230 మేర తగ్గగా, తాజాగా అదే ధరలో మార్కెట్ అవుతోంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,150 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,810 వద్ద ట్రేడ్ అవుతోంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం రూ.170 మేర స్వల్పంగా ధర తగ్గగా, నేడు అదే ధరలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,030 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,610 వద్ద కొనసాగుతోంది. 



వెండి ధర (Silver Rate in India) గత వారం భారీగా దిగొచ్చింది. ఓవరాల్‌గా ఆ వారంలో రూ.11000 మేర ధర పతనమైంది. శనివారం సాయంత్రం రూ.300 మేర వెండి ధర తగ్గడా నేడు అదే ధరల వద్ద మార్కెట్ అవుతోంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.59,000గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇదే ధర వద్ద వెండి ట్రేడ్ అవుతుంది. 



 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe