Gold Prices Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన Silver prices
Gold Price Today, Silver prices today: బంగారం ధరలు (Gold prices today) పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. శనివారం మార్కెట్‌లో వెండి ధరలు (Silver prices today) కిలోకి రూ.1200 మేర తగ్గి రూ. 59,500 కి దిగొచ్చింది.
Gold Price Today, Silver prices today: బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల బంగారం ధరలు రూ.980 మేర పెరిగింది. ధరల పెంపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 పలుకుతోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,470 ఉంది. ఢిల్లీ, ముంబై నగరాల మధ్యే బంగారం ధరల్లో భారీ వ్యత్యాసం కనిపించింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 పలుతుండగా (Gold rates today Hyderabad), 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,350 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 గా పలుకుతుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 గా ఉంది. విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 గా (Gold rates today Visakhapatnam) పలుకుతోంది.
Also read : Ather Energy: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్...ఏ స్కూటర్‌కైనా ఫ్రీ ఛార్జింగ్ అంటున్న 'అథర్'..
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 (Gold rates today Bengaluru) ఉంది.
ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910 గా (Gold rates today in chennai) ఉంది.
బంగారం ధరలు (Gold prices today) పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. శనివారం మార్కెట్‌లో వెండి ధరలు (Silver prices today) కిలోకి రూ.1200 మేర తగ్గి రూ. 59,500 కి దిగొచ్చింది.
Also read : Mahindra Hyper Car: పినిన్ ఫరినాతో మహీంద్రా ఒప్పందం, మార్కెట్‌లో హైపర్ కారు త్వరలో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook