5 Working Days: బ్యాంక్ ఉద్యోగులకు డబుల్ బొనాంజా... ఆ నెల నుంచే వారానికి ఐదురోజుల పని.. జీతాల పెంపు..
Bank Employees:తొందరలోనే బ్యాంక్ ఉద్యోగులకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి వారానికి ఐదురోజుల పనిదినాలను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ లతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది.
Salery Hike And 5 Days Working Proposal: బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచో తమకు వారానికి ఐదు పనిదినాలు ఉండేలా చూడాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఐదుపనిదినానల్లో పనివేళల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. తమ న్యాయపరమైన ఈ డిమాండ్ ను నెరవేర్చాలని బ్యాంక్ ఎంప్లాయిస్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. దీంతో వీరి కల జూన్ నుంచి సాకారం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ఒక లేఖను రాసినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. జూన్ 2024 నాటికి 17% జీతాల పెంపుపై కూడా మంచి నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం. కాగా, ఈ ప్రతిపాదనపై అన్ని బ్యాంకులు ఆర్థిక మంత్రితో చర్చించి, ఆమోదం పొందిన తర్వాత, ఉద్యోగులందరికీ త్వరలో శుభవార్త అందుతుంది.
Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ బ్యాంక్‌లలోని ఉద్యోగుల జీతాలను పెంచాలని, పనిదినాలను వారానికి 6 రోజుల నుండి 5 పని దినాలకు తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది. కాబట్టి మంత్రిత్వ శాఖ దీనిపై చర్చించి, తొందరలోనే అందరికి ఆమోదం యోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని బ్యాంక్ యూనియన్ లు ఆశిస్తున్నాయి. దీంతో భారతదేశంలోని బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ వారానికి 5 పని దినాలు సడలింపు పొందవచ్చు.
ఈ బ్యాంకుల్లో 5 పని దినాలు..
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్స్ కూడా ప్రతిపాదనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- RBI, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్- LIC ఇప్పటికే 5 పనిదినాల సౌకర్యాలను కలిగి ఉన్నాయని పేర్కొంది. ఈ అథారిటీలన్నీ కేంద్ర ప్రభుత్వం కింద నడుస్తున్నాయి, ఆర్‌బిఐ, ఎల్‌ఐసిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ శని, ఆదివారాల్లో రెండు సెలవులు సడలింపు లభిస్తోంది. కాబట్టి బ్యాంకులకు 5 పనిదినాల ఫార్ములాను ఆమోదించి, భారతదేశంలోని అన్ని బ్యాంకులకు ఒకే విధమైన ఏర్పాటు చేయాలని యూనియన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
Read More: Pooja Hegde: పొట్లంకట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు.. ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఫోటోలు
తొందరలోనే దీనిపై మంచి నిర్ణయం రావాలని అటూ బ్యాంక్ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఐదురోజుల పనిదినాలతో కస్టమర్లకు మంచి సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. రెండు రోజుల సెలవులతో పనిభారం నుంచి కాస్తంత ఉపశమనం కూడా లభిస్తుందని పలువురు బ్యాంక్ ఎంప్లాయిస్ అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook