Central Govt Employees Housing Projects: కేంద్రప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మరో శుభవార్త వచ్చింది. 11 ఏళ్ల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తున్న క్వార్టర్స్‌కు సంబంధించి కీలక మార్పులు చేసింది. తక్కువ, మిడిల్ గ్రేడ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం భవిష్యత్‌లో నిర్మించే అన్ని గృహ ప్రాజెక్టులలో ప్లింత్ ఏరియా, భవనం లేదా ఫ్లాట్‌ స్పెసిఫికేషన్‌లను కేంద్రం సవరించింది. అన్ని కొత్త వసతి గృహాలలో ప్రస్తుత ఏరియా స్పెసిఫికేషన్‌లతో పోలిస్తే లివింగ్ స్పెస్‌ శాతం నుంచి 19 శాతం ఎక్కువగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారుల వసతి కోసం ప్లింత్ ఏరియాలో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఇల్లు ఉన్న వారికి కూడా వస్తుంది. 'టైప్ 8' ఇళ్లకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. ఈ ఇళ్లు ఎంపీలు, మంత్రులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, ఏదైనా ట్రిబ్యునల్ చైర్‌పర్సన్‌లకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే.


లివింగ్ స్పెస్ పెంచేందుకు గల కారణాలను కేంద్రం వివరించింది. ప్రస్తుతం ఉన్న 'టైప్ 2', 'టైప్ 3', 'టైప్ 4' ఇళ్లలో మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్, ఏసీలు ఏర్పాటు చేసేందుకు ఎక్కువ స్థలం అవసరమని..  ఈ వస్తువులను ఉంచడం కష్టమని తెలిపింది. వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం ఏడు రకాల ఇళ్లను (ఫ్లాట్‌లు, బంగ్లాలు) కేటాయిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఒక బెడ్‌ రూమ్, కిచెన్, టాయిలెట్‌తో టైప్-1 వసతిని నిర్మించకుండా చేసింది. ఇప్పుడు అతి చిన్న వసతి (టైప్-II)లో రెండు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లలో ఈ ఫ్లాట్‌ల కోసం లివింగ్ ఏరియా 911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ప్రస్తుత ప్రమాణం కంటే 19% ఎక్కువ.


మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ సందర్భంగా డీఏ పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈసారి కూడా 4 శాతం పెంపు దాదాపు ఖరారు అయింది. ప్రస్తుతం 46 శాతం డీఏ అందుతుండగా.. మరోసారి 4 శాతం పెంచితే మొత్తం డీఏ 50 శాతానికి చేరుతుంది. కేంద్ర కార్మిక శాఖ ప్రతి నెలా విడుదల చేస్తున్న పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) ఆధారంగా DA, DR పెంచుతున్న విషయం తెలిసిందే. చివరగా గతేడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగింది. జూలై 1వ తేదీ నుంచి అమలు చేశారు. కేంద్రం నిర్ణయంతో 48.67 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరింది. 


Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు


Also Read: Zee News-Matrize Survey: ఏపీలో ఈసారి అధికారం ఆ పార్టీదే, సంచలన సర్వే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter