Life Certificate: పెన్షనర్లు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్ విధిగా సమర్పించాల్సి ఉంది. నిర్ణీత గడువులోగా సమర్పించకుంటే పెన్షన్ ఇతర సౌకర్యాలు నిలిచిపోతాయి. వాస్తవానికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ప్రభుత్వం విదించిన గడువు డిసెంబర్ 31. అంటే మరో 18 రోజుల్లో ముగియనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పెన్షన్ కొససాగించుకునేందుకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వం డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఇప్పుడీ గడువును ఓ నెల రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2025 జనవరి 31 వరకూ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దాఖలు చేయవచ్చు. ఇ సేవ, ఇ మిత్ర, బయోమెట్రిక్ విధానం, ఆన్‌లైన్ పెన్షన్ పోర్టల్‌లో దాఖలు చేయవచ్చు. 


ప్రస్తుతం పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే గడువు తేదీని వచ్చే ఏడాది జనవరి 31 వరకు అంటే ఓ నెలరోజులు పొడిగిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడిక వచ్చే ఏడాది జనవరి 31లోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకుంటే ఫిబ్రవరి నుంచి పెన్షన్లు నిలిచిపోనున్నాయి. తిరిగి ఎప్పుడైతే సమర్పిస్తారో అప్పట్నించి పెన్షన్ అందుతుంది. 


లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి


పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షన్ పోర్టల్, ఇ మిత్ర, మీ సేవ, బయోమెట్రిక్, పోస్టాఫీసు లేదా బ్యాంకుల్లో సమర్పించవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ గెజిటెడ్ అధికారి ధృవీకరణ సంతకంతో ఉండాలి. లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ పత్రం అనేది చాలా అవసరం. ఇది బయోమెట్రిక్ అనుసంధానిత డిజిటల్ పత్రం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు విధిగా సమర్పించాల్సి ఉంది. 


Also read: Supreme Court: మందిర్ మసీదు వివాదాలకు బ్రేక్, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.