Supreme Court: రామ జన్మభూమి వివాదం పరిష్కారమైనప్పటి నుంచి దేశంలో ప్రార్ధనా స్థలాల వివాదాలు అధికమయ్యాయి. ప్రార్ధనా స్థలాల పరిరక్షణ చట్టం అమల్లో ఉన్నా..ట్రయల్ కోర్టులు ఇష్టారాజ్యంగా ఇస్తున్న ఆదేశాలతో సమస్య పెరుగుతోంది. వివాదం కాస్తా పెరిగి పెద్దదై ఘర్షణగా మారుతోంది.
దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న మందిర్ మసీదు వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు. ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించి దిగువ కోర్టులు ఇష్టారాజ్యంగా ఇస్తున్న ఉత్తర్వులతో పరిస్థితి విషమిస్తోంది. పిటీషన్ వేసిందే ఆలస్యం దిగువ కోర్టులు సర్వేలకు ఆదేశిస్తుండటంతో సమస్య సున్నితంగా మారుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన స్వభావాన్ని వివాదాస్పదం చేసే కేసుల్లో మతపరమైన నిర్మాణాలు లేదా సర్వేలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని దేశంలోని దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రార్ధనా స్థలాల చట్టం 1991కు ఉన్న రాజ్యాంగ బద్ధతపై సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ విచారణ పూర్తయ్యేవరకు మతపరమైన నిర్మాణాలు, స్వభావానికి సంబంధించి కొత్త వాజ్యాలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు దిగువ కోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టులు ఇష్టారాజ్యంగా ఆదేశాలు జారీ చేయవద్దని కోరింది. ప్రార్ధనా స్థలాల చట్టం రాజ్యాంగ బద్ధత కేసులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరగా సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువిచ్చింది. దేశంలో ప్రస్తుతం యూపీలోని సంభాల్‌లో ఉన్న షాహీ జామా మసీదు, వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు, మధురలోని షాహీ ఈద్గా మసీదు, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వివాదాలున్నాయి.
Also read; AP Politics: వైసీపీలో ఏం జరుగుతోంది, వరుసగా నేతల రాజీనామాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.