ఐఐటీ ( IIT ) ..విద్యార్ధులకు ఓ స్వప్నం. ఇది సాధిస్తే చాలనుకుంటారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో చేరాలనుకునే విద్యార్ధులకు ఇప్పుడొక శుభవార్త. ఇకపై జేఈఈ మెయిన్స్ పరీక్ష ( JEE Mains Exam ) ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవ్యాప్తంగా ఇప్పటికీ అత్యున్నత ప్రమాణాలు పాటించేదిగా..ఇప్పటికీ ఛాలెంజ్ గా ఉన్న కోర్సు ఐఐటీ. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఐఐటీ కళాశాలల్లో ప్రవేశానికి కావల్సింది జేఈఈ మెయిన్స్ పరీక్షలో ర్యాంక్ రావడం. ఇదే అడ్మిషన్ కు కొలమానం. ఇప్పటివరకూ కేవలం 3 భాషల్లోనే ఈ పరీక్షలున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ( Central Govenrment ) విద్యార్ధులకు ఓ శుభవార్త అందించింది. వచ్చే యేడాది నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షను ప్రాంతీయ భాషల్లో ( JEE Mains in Regional languages ) నిర్వహించనున్నామని ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ( Central Minister Ramesh Pokhriyal ) ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యావిధానం ( NEP ) కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. 


కేంద్రమంత్రి ఏం చెప్పారు..


ఇకనుంచి జేఈఈ మెయిన్స్ ( JEE Mains ) పరీక్ష ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నాము. దీని ఆధారంగా రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు లభిస్తాయి. పీఐఎస్ఏ ( Programme for International Student Assessment ) లాంటి పరీక్షల్లో టాప్ స్కోర్ సాధిస్తున్న దేశాలు కూడా మాతృ భాషలోనే విద్యాబోధన సాగిస్తున్నాయన్న ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా పరీక్షలో విద్యార్థులు ప్రశ్నలను మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి,ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 


తాము ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదని..మాతృభాషలో విద్యాబోధన చేయడం ద్వారా భారతీయ భాషల్ని మరింతగా బలోపేతం చేయవచ్చని ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పిన పరిస్థితి ఉంది. కేంద్రం..విద్యార్ధులపై బలవంతంగా ఏ భాషను రుద్దదని ఆయన అన్నారు. దేశంలోని 22 భాషలను మరింత బలోపేతం చేయడం.. ప్రమోట్ చేయడమే తమ ఉద్దేశ్యమని చెప్పారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు. Also read: CCMB on Vaccine: వ్యాక్సిన్ కు మరో ఏడాది సమయం, తీవ్రత ఇంకా తగ్గలేదు