Good news: నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియన్ చీతా.. ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేసిన కేంద్రమంత్రి..
Project Cheetah: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఏడు దశాబ్దాల తర్వాత భారత్ గడ్డపై చీతాలు జన్మించినట్లయింది.
Namibian cheetah gives birth to cubs: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉన్న నమీబియా చిరుతల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. గతేడాది తీసుకొచ్చిన చిరుతల్లో ఒకటైన సాషా కిడ్నీ వ్యాధి కారణంగా మరణించిన మూడు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఈ కూనలు జన్మించిన విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్ ద్వార పంచుకున్నారు. గత 70 ఏళ్లలో భారత్ గడ్డపై చీతాలు జన్మించడం ఇదే తొలిసారి.
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం గతేడాది నమీబియా నుంచి భారత్‌కు ఎనిమిది చీతాలను తీసుకొచ్చింది. వీటిని మోదీ జన్మదినమైన సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ లో విడిచిపెట్టారు. ఇందులో సాషా అనే ఆడ చీతా ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ప్రాజెక్టు చీతాకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తాజాగా నాలుగు చీతాలు జన్మించడం శుభపరిణామం. మిగిలిన ఏడు చీతాలు పూర్తి ఆరోగ్యంగా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్-వైల్డ్ లైఫ్) జెఎస్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెలలో దక్షిణాఫ్రికా నుండి కెఎన్‌పికి తీసుకువచ్చిన పన్నెండు చిరుతలను ప్రస్తుతం క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. భారతదేశంలోని చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. దీంతో దేశంలో చీతాలు అంతరించినట్లు 1952లో అధికారికంగా ప్రకటించారు.
Also Read: Amritpal Singh CCTV Footage: ఢిల్లీలో సీసీటీవీ కెమెరాలకు చిక్కిన అమృత్ పాల్ సింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK