Germany Jobs in Telugu: జర్మనీ భారతీయులకు శుభవార్త అందిస్తోంది. ఆ దేశం బ్లూ కార్డ్ పాలసీలో మార్పులు చేయడంతో భారత టెక్ ఉద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. కేవలం వీసా ప్రక్రియ సులభతరం అవడమే కాకుండా భారతీయులకు ఎక్కువ ఉద్యోగాలు లభించనున్నాయి. జర్మనీలో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడాలనుకునేవారికి మంచి అవకాశమిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూరోపియన్ యూనియన్‌లో భాగమైన జర్మనీలో భారతీయులకు మంచి అవకాశాలు లభించనున్నాయి. ఆ దేశం దృష్టి ఇప్పుడు ఇండియాపై ఉంది. భారతదేశంలోని ఇంజనీర్లు, వర్కింగ్ సిబ్బంది కోసం ఏకంగా బ్లూ కార్డ్ పాలసీలో కీలకమార్పులు చేసింది. కాంప్లెక్స్ వీసా ప్రక్రియ, జీతాల పరిమితితో విదేశీ ఉద్యోగులకు ఎదురౌతున్న సమస్యల్ని జర్మనీ గుర్తించింది. దాంతో బ్లూ కార్డ్ పాలసీలో మార్పులు చేసిన విదేశాల్లోని వృత్తి నిపుణులకు అవకాశాలు పెంచింది. ఈ కొత్త పాలసీ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. బ్లూ కార్డ్ పాలసీలో జర్మనీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో అత్యధికంగా ప్రయోజనం పొందగలిగేది భారతీయులే. ఎందుకంటే భారతదేశానికి చెందిన టెక్ నిపుణులకు ఆ దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. 


బ్లూ కార్డ్ అనేది యూరోపియన్ యూనియన్ దేశాల్లో పనిచేసేందుకు లభించే అనుమతి. ఈయూలోని 27 దేశాల్లో 25 దేశాలు బ్లూ కార్డ్ పాలసీని అమలు చేస్తున్నాయి. ఇంకా సులభంగా చెప్పాలంటే అగ్రరాజ్యం అమెరికాలోని గ్రీన్ కార్డ్ వంటిది. అయితే అమెరికా గ్రీన్ కార్డు కేవలం ఆ దేశానికే పరిమితం కాగా యూరోపియన్ యూనియన్ ఇచ్చే బ్లూ కార్డ్ 25 దేశాలకు వర్తిస్తుంది. ఇది హై స్కిల్డ్ వృత్తి నిపుణులకు నాలుగేళ్ల కాలానికి ఇస్తారు. ఆ తరువాత రెన్యువల్ చేయించుకోవచ్చు. బ్లూ కార్డ్ పొందితే ఈయూ పౌరసత్వం కూడా పొందవచ్చు. 


బ్లూ కార్డ్ పాలసీలో కనీస వేతనం పరిమితి గణనీయంగా తగ్గింది. అంటే కనీస వేతనం ఏడాదికి 45,300 యూరోలు కలిగినా బ్లూ కార్డ్ పొందవచ్చు. జర్మనీలో జీతాలతో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువ. ఐటీ, హెల్త్ కేర్, ఇంజనీరింగ్ రంగాల్లో కనీస వేతనం 41,041 యూరోలు ఇచ్చే ఉద్యోగాలకు జర్మనీలో చాలా డిమాండ్ ఉంది. అందుకే బ్లూ కార్డ్ పాలసీలో చేసిన మార్పులతో ఇండియా టెక్ నిపుణులకు జర్మనీలో పెద్దఎత్తున అవకాశాలు కలగనున్నాయి. ఎందుకంటే జర్మనీలో ప్రస్తుతం హెల్త్ కేర్, ఐటీ, ఇంజనీరింగ్ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలున్నాయి. ఇప్పుడు బ్లూ కార్డ్ పాలసీలో కొత్తగా ఇతర రంగాల్ని కూడా చేర్చారు. 


మీరు ఒకవేళ డిగ్రీ పూర్తి చేసుంటే జర్మనీలో 41 వేల యూరోల కనీస వేతనంతో మంచి ఉద్యోగం పొందవచ్చు. అదే సమయంలో తగిన సామర్ధ్యం, ప్రతిభ ఉండి డిగ్రీ లేకపోయినా ఫరవాలేదు. జర్మనీలో డిగ్రీ కంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. డిగ్రీ లేకున్నా ఐటీలో మూడేళ్ల అనుభవం ఉంటే బ్లూ కార్డ్ లభిస్తుంది. పెద్దఎత్తున విదేశీ సిబ్బందిని ఆకర్షించేందుకు జర్మనీ దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేస్తోంది. దీనివల్ల జర్మనీలో ఉద్యోగ నిమిత్తం స్థిరపడి కెరీర్ అభివృద్ధి చేసుకోవాలనుకునేవారికి మరింతగా అవకాశాలుంటాయి. 


జర్మనీలో ప్రస్తుతం వృత్తి నిపుణులకు కొరత ఉంది. దేశంలో వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అదే సమయంలో అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం పెరుగుతోంది. అందుకే ఇప్పుడు జర్మనీ విదేశాల నుంచి ముఖ్యంగా ఇండియా నుంచి టెక్ నిపుణులను డిగ్రీ లేకపోయినా రమ్మని ఆహ్వానిస్తోంది. బ్లూ కార్డ్ పాలసీలో కీలక మార్పులు చేసింది. 


Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.