``spying for Pakistan``: పాక్‌కు రహస్యాలు చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
BSF constable held on charges of spying: సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లో పనిచేస్తూ, శత్రు దేశం పాకిస్థాన్(Pakistan)కు గూఢచారి(Spy)గా మారిన ఓ ఉద్యోగిని గుజరాత్ ఏటీఎస్(Gujarat Anti Terrorism Squad) పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూ-కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్ సాజిద్(Sajjad).. పదేళ్ల క్రితం 74 బీఎస్‌ఎఫ్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్(Bhuj)లో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా వాట్సాప్ ద్వారా పాక్‌కు రహస్య, సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా అతని సోదరుడు వాజిద్, సహచరుడు ఇక్బాల్ రషీద్‌ల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నట్టు ఏటీఎస్ గుర్తించింది.
Also read:UP: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్..! కట్నం ఎంత తీసుకున్నారో లెక్క చెప్పాలి..!
2011, 2012 సంవత్సరాలలో సాజిద్ 46 రోజుల పాటు పాక్‌లో గడిపినట్టు అతని పాస్‌పోర్టు ద్వారా బయటపడింది. బీఎస్‌ఎఫ్(BSF)లో నమోదైన సాజిద్ పుట్టిన రోజు కూడా తప్పేనని తేలింది. ఈ ఆధారాలు సేకరించిన ఏటీఎస్ పోలీసులు.. భుజ్‌లోని బీఎస్‌ఎఫ్ కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతన్నుంచి రెండు ఫోన్లు, ఇతర వ్యక్తుల పేర్లపై ఉన్న సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook