UP: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్..! కట్నం ఎంత తీసుకున్నారో లెక్క చెప్పాలి..!

Uttar Pradesh: వరకట్న వ్యవస్థని రూపుమాపేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. వివాహం సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 06:49 PM IST
  • యూపీ ప్రభుత్వం కొత్త రూల్
  • ఉద్యోగులు కట్నం తీసుకుంటే లెక్క చెప్పాలి
  • వరకట్న వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు
UP:  ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్..! కట్నం ఎంత తీసుకున్నారో లెక్క  చెప్పాలి..!

Uttar Pradesh Government: వరకట్న వ్యవస్థ(Dowry system)ని నిర్మూలించేందుకు ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం(Uttar Pradesh Government) పెద్ద ఎత్తున  చర్యలు తీసుకుంటుంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. పెళ్లి(Marriage) సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఓ ఉత్తర్వులో పేర్కొంది. 

వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి వరకట్న వివరాలు(Dowry details) సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ పేరిట నోటీసులు జారీ చేశారు.

Also Read: Zika Virus: ఉత్తరప్రదేశ్‌లో తొలి జికా వైరస్ కేసు.. ఐఏ‌ఎఫ్ ఆఫీసర్‌కు పాజిటివ్‌!

ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి..
ఏ ఏడాదిలో వివాహం జరిగింది? ఎటువంటి పరిస్థితుల్లో కట్నం తీసుకోవాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానాలివ్వాలని నోటీసుల్లో ఉంది. 2004 ఏప్రిల్ తర్వాత వివాహం(Marriage) చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఈ వాంగ్మూల పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఇవ్వకపోతే అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అక్టోబర్‌లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆ వివరాలను సమర్పించాలన్నారు. అయితే, గతంలో ఆస్తుల వివరాల(Asset details)ను తీసుకున్నారని, ఇప్పుడు వరకట్నం వివరాలు కోరడంపై ఉద్యోగ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

యూపీ(UP) ప్రభుత్వం 1999లో వరకట్న నిషేధ చట్టం(Dowry Prohibition Act) రూపొందించింది. 2004 మార్చి 31న ఈ చట్టానికి సవరణ చేసింది. అందులోని రూల్‌ 5 ప్రకారం.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని వాంగ్మూల పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News