గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చేశాయి. అయితే గుజరాతీయులు ఎలా ఓటు వేయారనే దానిపై కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక ప్రముఖ మీడియా సమాచారం ప్రకారం, బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ప్రజలు జై కొట్టారు. కాంగ్రెస్‌కి గ్రామీణ ప్రాంతాల్లో జై కొట్టారని.. కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి పుంజుకుందని పేర్కొనింది. 


ఒకసారి ఓట్ల లెక్కింపును బేరీజు వేసుకుంటే.. కమలదళం పట్టణ ప్రాంతాల్లో 73 సీట్లకుగానూ 55 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్ 18 స్థానాలలో గెలిచింది. జాంనగర్ నార్త్, రాజ్కోట్ సౌత్, రాజ్కోట్ తూర్పు, మెహ్మెదాబాద్, హిమాత్నగర్, సనంద్ స్థానాలను ఈసారి బీజేపీ కాంగ్రెస్ నుండి చేజిక్కించుకుంది. ఈ నెలలో ప్రధాని మోదీ ముమ్మరంగా ప్రచార ర్యాలీ నిర్వహించారు.


ఐతే బీజేపీ ఇదేజోరును గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగించలేకపోయింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపారు. గ్రామీణ నియోజకవర్గాలలో మొత్తం 109 సీట్లు ఉండగా.. అందులో కాంగ్రెస్ పార్టీ 62 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి, ఇతరులు 43, 4 స్థానాల్లో పోటీని ఇచ్చారు. విశేషమేమిటంటే బీజేపీకి చెందిన 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఈ స్థానాల్లో ఓడించింది. 3 స్వతంత్ర అభ్యర్ధులు గెలుపొందారు.


ఇక పాటీదార్ ఓట్లు తమకే పడ్తాయని రెండు పార్టీలు భావించాయి. అయితే ఇక్కడ కూడా పట్టణ ప్రాంతాల్లో నివసించే పాటీ ప్రజలు బీజెపీకి ఓటు వేయగా, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కాంగ్రెస్‌కి ఓటు వేశారు. 


ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ మెరుగుపడింది. మరోవైపు, మధ్య, సౌత్ గుజరాత్ లో బీజేపీ ఉనికి అలాగే ఉంది.


సోమవారం గుజరాత్ లో 182 స్థానాలకు ఎన్నికల కమిషన్ ఫలితాలను విడుదల చేసింది. బిజెపి 99 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండగా.. 80 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో ఇతరులు గెలిచారు.