Gujarat Elections 2022: మరో నాలుగు రోజుల్లో అంటే డిసెంబరు 1 నుంచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మెదలుకానుంది. ఈ నేపథ్యంలో పోర్‌బందర్ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా... మరో ఇద్దరు గాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన జవాన్లు పోరుబందర్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుక్డా గోసా గ్రామంలోని తుపాను పునరావాస కేంద్రంలో ఉంటున్నారు. శనివారం ఏదో విషయంలో జవాన్ల మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఓ జవాన్ పైరింగ్ కు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాల్యయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని జామ్ నగర్ లోని భావ్ సింగ్జీ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరికి కడుపులో బుల్లెట్ దూసుకెళ్లగా..మరొకరికి కాలికి తగిలిందని జిల్లా ఎన్నికల అధికారి ఎఎం శర్మ  చెప్పారు. మృతి చెందిన జవాన్లు మణిపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందినవారని ఆయన అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు శర్మ తెలిపారు. 


గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న ఉంటుంది. రెండో విడత డిసెంబరు 5న నిర్వహించనున్నారు. డిసెంబరు 8న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల పోలింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా భద్రతా బలగాలను, పోలీసులను మోహరిస్తున్నారు. 


Also Read: Delhi MCD Election 2022: అరవింద్ కేజ్రీవాల్ హత్యకు బీజేపి కుట్ర ? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి