Surat Gas Leak: సూరత్‌లో విషాదం..గ్యాస్ లీకై ఆరుగురు మృతి... 20మందికి అస్వస్థత!
Surat Gas Leak: సూరత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ కంపెనీలో కెమికల్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై ఆరుగురు మరణించారు.
Gas leak in Surat: గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కంపెనీలో కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువు లీకై (Gas Leak) ఆరుగురు మరణించారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన న్యూ సివిల్ ఆస్పత్రికి (New Civil Hospital) తరలించారు. సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో (Sachin GIDC area of Surat) గురువారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
''సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలోని ఒక కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున గ్యాస్ లీకేజీ కారణంగా ఆరుగురు మరణించగా, మరో 20 మంది సివిల్ ఆసుపత్రిలో చేరినట్లు'' ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఓంకార్ చౌదరి (Dr Omkar Chaudhary) తెలిపారు.
Also Read: Delhi Fire Breaks: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు!!
సచిన్ జీఐడీసీ ప్రాంతంలో రోడ్డుపక్కన పార్కు చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ (chemical tanker) పైపు లీకై ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు. విషవాయువు వ్యాపించిన క్షణాల్లోనే సమీపంలోని విశ్వప్రేమ్ మిల్లో పని చేసే కార్మికులు సృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ కార్మికులంతా కెమికల్ ట్యాంకర్‌కు 8-10 మీటర్ల దూరంలో నిద్రిస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఉదయం 5 గంటల సమయంలో గ్యాస్ లీకై పలువురు సృహకోల్పోయినట్లు తమకు సమాచారం అందిందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook