Gang rape: రైల్వే కోచ్‌లో ఉరేసుకున్న యువతి... గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసుల అనుమానం
Gang rape on Gujarat woman : గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు గుర్తించిన యువతి అనుమానాస్పద మృతి కేసులో గ్యాంగ్ రేప్ అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
Gang rape : గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 4న రైల్వే పోలీసులు ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. వల్సద్ రైల్వే స్టేషన్‌లో (Indian Railway) రైలు ఆగి వున్న సమయంలో రైల్లోని ఓ కోచ్‌లో యువతి ఉరివేసుకుని ఉండటం గమనించారు. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టమ్ రిపోర్టులో వెల్లడైంది. అయితే అంతకుముందు ఆమెపై గ్యాంగ్ రేప్ (Gang rape) జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత యువతి తన డైరీలో రాసుకున్న కొన్ని విషయాలు దీనికి బలం చేకూర్చేవిగా ఉన్నాయి.
సౌత్ గుజరాత్‌కి (Gujarat) చెందిన ఆ యువతి వడోదరాలోని ఓ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ఎన్‌జీవోలో పనిచేస్తోంది. ఆమె తన డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం... ఈ నెల 4న ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమె కాళ్లు, చేతులు కట్టేసి... కళ్లకు గంతలు కట్టి... ఆటోలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఓ బస్సు డ్రైవర్ వారిని గమనించి దగ్గరికి వెళ్లాడు. దీంతో భయపడిన ఆ ఇద్దరు వ్యక్తులు యువతిని అక్కడే వదిలి పారిపోయారు. ఆ తర్వాత ఆ డ్రైవర్ సాయంతో ఆమె తన స్నేహితురాలి వద్దకు చేరింది.
Also Read: Siddipet Collector Venkatram Reddy: సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా.. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరిక?
ఆ యువతి తన డైరీలో రాయకపోయినప్పటికీ... ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి (Gang rape) పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వడోదరా ఐజీ సుభాష్ త్రివేది మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుందన్నారు. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందో లేదో తేల్చి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించిందన్నారు. ఈ కేసు మిస్టరీని తేల్చేందుకు ఇప్పటికే 25 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ ల్యాబ్, రైల్వే పోలీస్, వడోదరా సిటీ పోలీస్ ఇలా ఆయా విభాగాలకు చెందినవారితో ఈ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.బాధితురాలు తన డైరీలో స్పష్టమైన వివరాలు పేర్కొనలేదని... దీంతో ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినది లేనిది తెలియరావట్లేదని అన్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో యువతి ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు తేలిందన్నారు. మరిన్ని మెడికల్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని... అవి అందితే బాధితురాలి మృతిపై క్లారిటీ వస్తుందని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook