Gyanvapi Masjid Case: జ్ఞానవాపి కేసులో హిందూ సంఘాలకు షాక్.. శివలింగం కార్బన్ డేటింగ్ కు కోర్టు నో
Gyanvapi Mosque Case: వారణాసి జ్ఞానవాపి కేసులో సంచలన తీర్పు వచ్చింది. ఈ కేసులో విచారణ జరిపిన వారాణాసి జిల్లా కోర్టు.. శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయడానికి అనుమతి నిరాకరించింది. ఇందుకు సంబంధించి హిందూ సంఘాలు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
Gyanvapi Mosque Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి జ్ఞానవాపి కేసులో సంచలన తీర్పు వచ్చింది. ఈ కేసులో విచారణ జరిపిన వారాణాసి జిల్లా కోర్టు.. శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయడానికి అనుమతి నిరాకరించింది. ఇందుకు సంబంధించి హిందూ సంఘాలు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. శాస్త్రీయ పరిశీలనకు నిరాకరించింది వారణాసి కోర్టు. శాస్త్రీయ పరిశీలన ద్వారా శివలింగం నమూనాలు బయటపడతాయి అన్న హిందూ సంఘాలు వాదించినా కోర్టు సమ్మతించలేదు. జ్ఞానవాపి కేసులో తీర్పు సందర్భంగా వారణాసి కోర్టు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
ఇక జ్ఞాన్ వాపి మసీదులో పూజలకు అనుమతించాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణను వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసంది. యూపీ న్యాయ విభాగానికి సంబంధించిన సీనియర్, అనుభవజ్ఞులైన జ్యుడీషియల్ అధికారి ఈ కేసును విచారించాలని ఆదేశించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ నుంచి కేసును వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసినట్లు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్నదేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో మే 14 నుంచి 16 వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది కమిషన్. వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో శివలింగం కనిపించిందని చెబుతున్న ప్రాంతాన్ని సీల్ చేయాల్సిందిగా సంబంధిక అధికారులను జడ్జీ ఆదేశించారు. అయితే వీడియో గ్రఫీ తీస్తుండగా అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు చెప్పారు. దీంతో జ్ఞాననాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.
Read Also: Munugode Bypoll: సెంచరీ దాటిన మునుగోడు నామినేషన్లు.. ఉప సమరంలో గద్దర్ ను ఆపేసిందెవరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook