Cow urine Hand sanitizers: గోమూత్రంతో శానిటైజర్.. కరోనాక్ చెక్ పెడుతుందా ?
ఆల్కహాల్‌తో తయారైన హ్యాండ్ శానిటైజర్స్‌కి ( Hand sanitizer ) చెక్ పెడుతూ గోమూత్రంతో తయారైన శానిటైజర్స్ ( Cow urine Hand sanitizer ) త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఔను, మీరు చదివింది నిజమే..
అహ్మదాబాద్: ఆల్కహాల్‌తో తయారైన హ్యాండ్ శానిటైజర్స్‌కి ( Hand sanitizer ) చెక్ పెడుతూ గోమూత్రంతో తయారైన శానిటైజర్స్ ( Cow urine Hand sanitizer ) త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఔను, మీరు చదివింది నిజమే.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కి చెందిన మహిళల పొదుపు సహకార సంఘం ఆవు మూత్రంతో శానిటైజర్స్ తయారు చేసింది. మరో వారం రోజుల్లోనే ఈ హ్యాండ్ శానిటైజర్స్ మార్కెట్‌లోకి రానున్నట్టు సదరు సహకార సంఘం వెల్లడించింది. కామధేను దివ్య ఔషధి మహిళా మండలి ( Kamdhenu Divya Aushadhi Mahila Mandali ) పేరిట కొనసాగుతున్న సహకార సంఘం.. గో-సేఫ్ బ్రాండ్ పేరుతో శానిటైజర్‌ను ( Go safe sanitizers ) విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. Also read : Rafale fighter jets: జాతికి అంకితం కానున్న రఫేల్ యుద్ధ విమానాలు
ఇదే విషయమై కామధేను అర్థసేతు డైరెక్టర్ మనీషా మాట్లాడుతూ "ఎఫ్‌డీసీఏ నుంచి గోమూత్రం శానిటైజర్ తయారీ, మార్కెటింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామని... వారంలోపు లైసెన్స్ వస్తుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తంచేశారు. గోమూత్ర హ్యాండ్ శానిటైజర్ తయారీలో గోమూత్రంతో ( Gomutra ) పాటు వేప, తులసి వంటి సహజ మూలికలను ఉపయోగించినట్టు మనీషా తెలిపారు. చాలామందికి గో మూత్రంతో తయారయ్యే ఔషధాలు, ఉత్పత్తులపై పూర్తి విశ్వాసం ఉంటుందని.. ఆ నమ్మకంతోనే ఈ ప్రయోగానికి తెరతీసినట్టు మనీషా వెల్లడించారు. Also read : Rohit Sharma's six hits bus: రోహిత్ శర్మ సిక్సర్ షాట్.. బస్సుకి తగిలిన బాల్
ఇదిలావుంటే, గతంలో రాజస్థాన్‌కి చెందిన ఓ సంస్థ ఆవు పేడతో ( Cow dung ) తయారు చేసిన పేపర్‌తో డిస్పోజబుల్ ఫేస్ మాస్కులు ( Face masks ) రూపొందించి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. Also read : TV actress Sravani suicide case: టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది ?
గోమూత్రంతో హ్యాండ్ శానిటైజర్ ( Gomutra sanitizers ) వస్తున్నట్టు వార్తలు వెలువడిన మరుక్షణమే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు కూడా మొదలయ్యాయి. కరోనావైరస్‌కి ( Coronavirus ) ఈ గోమూత్ర శానిటైజర్ చెక్ పెడుతుందా అనేదే ఈ చర్చల్లో ప్రధానంగా వినిపించిన సందేహం. Also read : AP: తాజాగా 10 వేలకు పైగా కరోనా కేసులు