Andhra Pradesh: తాజాగా 10 వేలకు పైగా కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యం 10వేల కరోనా కేసులు (CoronaVirus Cases In AP) నమోదు కావడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మరణాలు ప్రతిరోజూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.

Last Updated : Sep 9, 2020, 07:33 PM IST
Andhra Pradesh: తాజాగా 10 వేలకు పైగా కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,418 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (CoronaVirus Cases In AP) 5,24,617కు చేరింది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపితే రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,27,512 అయింది. నిన్న ఒక్కరోజు 71,692 శాంపిల్స్ పరీక్షించారు. AP: మద్యం వినియోగంలో 65 శాతం తగ్గుదల

గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 74 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. అధికంగా కడప జిల్లాలో 9 మంది చనిపోగా, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 4,634కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  Donald Trump: నోబెల్ శాంతి బహుబతి రేసులో డొనాల్డ్ ట్రంప్

మొత్తం కరోనా కేసులకుగానూ 4,25,607 మంది చికిత్స తర్వాత కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 97,271 యాక్టివ్ కేసులున్నాయి. Ananya Pandey Photos: అందాల భామ అనన్య గ్లామరస్ ఫొటోస్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x