Republic Day 2021 Wishes, Quotes: జనవరి 26.. స్వతంత్ర భారతావనిలో అతి ముఖ్యమైన రోజు. రెండు శతాబ్దాలకు పైగా బ్రిటీష్‌వారి చెరలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం సిద్ధించింది. కానీ మనం ఎలా నడుచుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్న భారత ప్రభుత్వ చట్టం 1935ని అనుసరించారు. బ్రిటీషు వారు అందించిన చట్టంను పక్కనపెట్టి సొంతంగా భారత్‌కు ప్రత్యేక రాజ్యాంగం తీసుకొచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారత్‌కు ప్రత్యేక రాజ్యాంగం రచించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. 2 సంవత్సరాల 11 నెలల 18రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించారు. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26వ తేదీ నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. తద్వారా భారత్ ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య’ రాజ్యంగా అవతరించింది. ప్రతి ఏటా జనవరి 26ను గణతంత్ర దినోత్సవం(Republic Day 2021)గా జరుపుకుంటున్నాం.


Also Read: Republic Day 2021: 72వ రిపబ్లిక్ డే.. 5 ముఖ్యమైన విషయాలు 



నేడు 72వ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని మీ స్నేహితులు, సన్నిహితుకులకు ఇలా శుభకాంక్షలు తెలపండి..
- స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలం. ఆంగ్లేయులపై పోరాటంలో విజయం. స్వీయ పాలనా రాజ్యాంగం.. Happy Republic Day 2021


- భవిష్యత్ తరాలు తమ జీవితాలను గౌరవంగా గడపడానికి ఎందరో మహానుభావులు సాహసోపేతమైన పోరాటం చేసి మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. 
మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


- మూడు రంగుల జెండా... ముచ్చటైన జెండా
భారతీయుల జెండా.. మన అంధకారాన్ని పొగొట్టిన జెండా
భారత్ గణతంత్ర రాజ్యామని తెలిపిన అజెండా మన రాజ్యాంగం...  గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 



- భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన భారత గడ్డ మీద పుట్టినందుకు గర్విస్తున్నాను. ఈ గొప్ప దేశంలో పుట్టి ఎందరో ధన్యులయ్యారు..  హ్యాపీ రిపబ్లిక్ డే 2021


Also Read: Patriotic Songs: దేశభక్తిని కళ్లకు కట్టినట్లు చూపించే Republic Day Songs



- దేశం మనదే తేజం మనదే - ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే - ప్రజల అండదండా మనదే
ఎన్ని భేదాలున్నా - మాకెన్ని తేడాలున్నా.. దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళ..
వందేమాతరం.. అందాం మనమందరం...   Happy Republic Day 2021


- మనసులో స్వేచ్ఛ, మాటల్లో బలం, మన రక్తంలో స్వచ్ఛత, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరులకు వందనం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


- కులాలు, మతాలు, భాషలు వేరైనా...
మనమంతా భారతీయులం.. మనదందా ఒకటే జాతి భారతజాతి..  Happy Republic Day 2021



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook