Haryana Election Result 2024: 2014 నుంచి వరుసగా రెండు సార్లు హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి ఈ సారి ఓటర్లు గట్టి షాక్ ఇస్తారని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. కానీ ఫలితాలు చూస్తుంటే.. ప్రభుత్వం అనుకున్నంత ప్రజా వ్యతిరేకత లేదనే విషయం ఫలితాలను చూస్తే తెలుస్తుంది. ముందుగా హరియాణాలో కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపించినా.. ఆ తర్వాత బీజేపీ ఆధిక్యంలో వచ్చింది. ఐతే.. లోక్ సభ ఎలక్షన్స్ ముందు మాత్రం అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించి షైనీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టి దిద్దుబాటు చర్యలకు దిగింది. అయనా.. ఈ ఎన్నికల్లో బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ ఫేస్ పైనే ఎన్నికలకు వెళ్లింది. ముఖ్యంగా అవినీతి రహిత పాలన, ఎలాంటి అవినీతి మరక లేకపోవడం బీజేపికి కలిసొచ్చే అంశాలనే చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక హరియాణా రాజకీయాలు మొత్తం బీజేపీ అధికారంలోకి రానంత వరకు జాట్ ల ఆధిపత్యంలోనే నడిచింది. మనోహర్ లాల్ ఖట్టర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికీ అంత ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలను శాసిస్తున్న జాట్ వర్గీయులు కొంచెం గుర్రుగా ఉన్నారు. అది మొన్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతిఫలించింది. దీంతో గత లోక్ సభ ఎన్నికల్లో అక్కడ 5 లోక్ సభ స్థానాలను బీజేపీ కోల్పోయింది.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


అయితే.. బీజేపీకి రైతు చట్టాలతోపాటు రెజ్లర్స్ ఆందోళనతో పాటు జాట్ వ్యతిరేకత పెద్దగా ప్రభావం చూపించలేదనే చెప్పాలి. ముఖ్యంగా మూడోసారి కూడా అతిపెద్ద పార్టీగా అవతరించడం మాత్రం మాములు విషయం కాదు. ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పినట్టు ప్రభుత్వంపై పెద్ద వ్యతిరేకత వ్యక్తం కావకపోవడం విశేషం. మరోవైపు బీజేపీ జాటేతర ఓసీలతో పాటు బీసీల పై దృష్టి సారించడంతో హరియాణాలో  భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలను సాధించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter