Gurugram: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెక్టార్ 111లో ఉన్న చెరువులో స్నానానికి దిగి ఆరుగురు చిన్నారులు నీట మునిగి (children drown in pond) మృత్యువాతపడ్డారు. వీరంతా 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు 4 గంటలపాటు శ్రమించి ఈ ఆరుగురి చిన్నారుల మృతదేహాలు బయటకు తీశాయి. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... చిన్నారులు సమీపంలోని శంకర్ విహార్ కాలనీకు చెందిన దుర్గేష్, అజిత్, రాహుల్, పీయూష్, దేవా, వరుణ్ గా గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతదేహాలను పోస్టుమార్టం కోసం సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించి.. డెడ్ బాడీస్ ను సంబంధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. మృతుల కుటుంబాలకు హరియాణా సీఎం మనోహర్​లాల్​ ఖట్టర్ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ తెలిపారు. చిన్నారుల మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


''ఈ 5-7 ఎకరాల విస్తీర్ణంలో అనేక గుంటలు ఉన్నాయని.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతల్లో భారీగా నీరు చేరింది. దీంతో స్నానం చేసేందుకు పిల్లలు అక్కడికి వెళ్లారు''’అని గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ తెలిపారు. "ఇది చాలా దురదృష్టకర సంఘటన. మేము అలాంటి తాత్కాలిక చెరువులను గుర్తించి, భవిష్యత్తులో అలాంటి ప్రమాదం జరగకుండా వాటి నీటిని తొలగిస్తాము" అని యాదవ్ అన్నారు.


Also Read: Bihar: 10 మందిని చంపి తిన్న పెద్ద పులి.. కాల్చి చంపిన షార్ప్ షూటర్లు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి