దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హత్రాస్ కేసు ( Hathras case ) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్న డీఐజీ భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


హత్రాస్ కేసు గురించి అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ( Uthar pradesh ) హత్రాస్ లో ఓ దళిత యువతిపై జరిగిన సామూహిత అత్యాచారం ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల పాత్రపై అనుమానాలున్నాయి. సంచలనంగా మారిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. 2005 ఐపీఎస్ బ్యాచ్ ( 2005 IPS Batch ) కు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ చంద్ర ప్రకాష్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లో సభ్యులు. 
ఇప్పుడు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ చంద్ర ప్రకాష్‌ భార్య 36 ఏళ్ల పుష్ప ప్రకాష్ ఆత్మహత్య ( DIG Wife suicide ) చేసుకోవడం సంచలనంగా మారింది. పుష్పప్రకాష్ లక్నోలోని నివాసంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను లోహియా ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


ఆత్మహత్యకు కారణమేంటనేది ఇంకా తెలియలేదు. ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కుటుంబపరంగా ఎటువంటి విబేధాల్లేవని తెలుస్తోంది. ఆరోగ్యపరమైన సమస్యలేవైనా ఉన్నాయా అనే కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. Also read: Jammu kashmir: మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం