Hathras gang rape case: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. హత్రాస్ ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
Hathras gang rape case live news updates: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీఘడ్ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ రిపోర్టులో బాధితురాలు అత్యాచారానికి గురైనట్టుగా నిర్ధారించలేదని హత్రాస్ ఎస్పీ విక్రాంత్ వీర్ ( Hathras SP Vikrant Vir ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్రాస్ రేప్ కేసు బాధితురాలు మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Hathras gang rape case live news updates: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీఘడ్ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ రిపోర్టులో బాధితురాలు అత్యాచారానికి గురైనట్టుగా నిర్ధారించలేదని హత్రాస్ ఎస్పీ విక్రాంత్ వీర్ ( Hathras SP Vikrant Vir ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ మెడికల్ కాలేజీ ఇచ్చిన నివేదికలో ( Medical report from Aligarh Muslim University Medical College ) బాధితురాలి ఒంటిపై గాయాలు ఉన్నట్టుగా మాత్రమే ఉంది కానీ.. ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా వైద్యులు ధృవీకరించలేదని ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ రిపోర్ట్ ( Forensic report ) కోసం వేచిచూస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath ) ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ( SIT ) విచారణ నిమిత్తం బుధవారం బాధితురాలి గ్రామానికి చేరుకుని ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడినట్టు ఎస్పీ తెలిపారు. ఘటన స్థలాన్ని సైతం కమిటీ పరిశీలించిందని.. టీమ్ ఇంకా గ్రామంలోనే ఉండి విచారణ జరుపుతోందని ఎస్పీ వెల్లడించారు. Also read : Hathras rape case: గ్యాంగ్ రేప్ కేసు బాధితురాలి తండ్రికి సీఎం ఫోన్
అగ్రవర్ణాలకు చెందిన నలుగురు యువకులు తమ కూతురిపై సామూహిక అత్యాచారానికి ( Gang rape ) పాల్పడి, దారుణంగా హింసించారని... వారిలో దాడిలో గాయపడిన కారణంగానే ఆమె ప్రాణాలు వదిలిందని బాధితురాలి కుటుంబం ( Hathras rape case victim's family ) ఆరోపిస్తుండగా.. తాజాగా అలీఘడ్ మెడికల్ కాలేజీ మెడికల్ రిపోర్టు అందుకు భిన్నంగా రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. Also read : Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం
హత్రాస్ రేప్ కేసు బాధితురాలు మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఐతే, అంతకంటే ముందుగా అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీకి చెందిన ఈ మెడికల్ కాలేజీలోనే వైద్యులు బాధితురాలికి చికిత్స అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe