Hathras rape case: గ్యాంగ్ రేప్ కేసు బాధితురాలి తండ్రికి సీఎం ఫోన్
Hathras rape case latest updates: లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలైన 19 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న ఈ సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను ఖండిస్తూ ప్రముఖులు, పౌరులు సామాజిక మాధ్యమాల్లో నిందితులపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
Hathras rape case latest updates: లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలైన 19 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న ఈ సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను ఖండిస్తూ ప్రముఖులు, పౌరులు సామాజిక మాధ్యమాల్లో నిందితులపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. Also read : Unlock 5.0 guidelines: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు.. కొత్తగా అందుబాటులోకి వచ్చే సేవలు
ఇదిలావుంటే, మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోది ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath ) బుధవారం అత్యాచార బాధితురాలి తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి బాధితురాలి తండ్రి ( Hathras gang rape victim's father ) విజ్ఞప్తి చేశారు. బాధితురాలి తండ్రి ఆవేదనను విన్న సీఎం యోగి.. ''ఈ రేప్ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం'' అని హామీ ఇచ్చారు. అలాగే బాధితురాలి కుటుంబానికి అన్నివిధాల అవసరమైన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును దర్యాప్తు చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని.. వారం రోజుల్లోనే ఈ ఘటనపై పూర్తి నివేదిక అందజేసేలా ఆదేశాలు జారీచేసినట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ ద్వారా తెలిపారు. Also read : బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా?: అసదుద్దీన్ ఒవైసీ
అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) సైతం ఈ ఘటనపై తనకు ఫోన్ చేసి మాట్లాడారని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని మోదీ ఆదేశించారని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe