UP Govt explains Hathras victims cremation at Supreme Court: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన దారుణ ( Hathras incident) సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అత్యాచారానికి గురై మరణించిన యువతి మృతదేహానికి అర్థరాత్రి బలవంతంగా దహనసంస్కారాలు (Hathras victims cremation ) నిర్వహించడంపై ప్రజలు, విపక్షాలు.. యూపీ పోలీసులు, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ( UP Govt) అర్థరాత్రి దహన సంస్కారాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో సుప్రీంకోర్టు (Supreme Court ) కు వివరించింది. అర్ధ‌రాత్రి 2.30 నిమిషాల‌కు ఎందుకు ద‌హ‌నం చేయాల్సి  వచ్చిందో క్షణ్ణంగా పేర్కొంటూ.. యూపీ ప్రభుత్వం అఫిడవిట్‌ను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఆమె మరణించిన తెల్లారి భారీ స్థాయిలో హింస, విధ్వంసం జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని, అందుకే రాత్రికి రాత్రే అత్యవసరంగా ఆమె అంత్యక్రియలను నిర్వ‌హించాల్సి వచ్చిందని యూపీ ప్ర‌భుత్వం పేర్కొంది. Also read: Hathras Gang Rape Case: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సప్దర్‌జంగ్ ఆసుపత్రి దగ్గర ఏర్పడిన ఉద్రిక్త పరిస్థుల మాదిరిగానే..  తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని ఇంటెలిజెన్స్ వ‌ర్గాల నుంచి సమాచారం అందిందని పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌కు కులం రంగు పూశారని, కావున హింస విధ్వంసాన్ని అద‌పు చేసేందుకు అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హ‌త్రాస్ కేసు విచారణ సుప్రీం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొనసాగే విధంగా తీర్పునివ్వాలని కోరింది. అయితే బాధితురాలి మృతదేహానికి అర్థ‌రాత్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె త‌ల్లితండ్రుల‌ను జిల్లా అధికారులు ఒప్పించారని అఫిడ‌విట్‌లో పేర్కొంది.  Also read: Hathras incident: ఎస్పీ సహా ఐదుగురు పోలీసులపై వేటు


సప్టెంబరు 14న పొలం పనులు చేస్తున్న 19 ఏళ్ల యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, నాలుక కోసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో మంగళవారం ( సెప్టెంబరు 29న) కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా, వారిని అనుమతించకుండానే ఆరోజు అర్థరాత్రి 2:30 గంటలకు పోలీసులు బలవంతంగా దహనం చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై వారం నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.  ఈ క్రమంలో యోగి ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా హత్రాస్ జిల్లా ఎస్పీతోసహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. దీంతోపాటు ఈ కేసు విచారణను సిట్‌తోపాటు, సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. Also Read : Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ