లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియం ( Loan Moratorium ) ను మీరు వినియోగించుకున్నారా..లేనిపక్షంలో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది..ఎవరికి కాదు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆదాయం తగ్గిపోయింది. దాంతో రుణాలు కట్టే పరిస్థితి లేకపోయింది. ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve Bank of India ) లోన్ మారటోరియం తీసుకొచ్చింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ఈ లోన్ మారటోరియం అమల్లో ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు దీన్ని వినియోగించుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. చిన్న- మధ్య తరహా కంపెనీలు, విద్య, హౌసింగ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ లాంటి రుణాలు తీసుకున్న వారిలో చాలా మంది ఈ లోన్ మారటోరియంను వినియోగించుకున్నారు. 


లోన్ మారటోరియం ఉంది కదా అని ఉపయోగించుకున్నవారికి బ్యాంకులు షాక్ ఇచ్చాయి. రుణగ్రహీతలు ఎన్ని నెలల పాటు మారటోరియంను వినియోగించుకుంటే అన్ని నెలలకు సంబంధించి వడ్డీల మీద వడ్డీని విధించాయి. దీంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే కొంతమంది లోన్ మారటోరియంను వినియోగించుకోలేదు. కష్టకాలంలో కూడా రుణాలు చెల్లించారు. ఇలాంటి వ్యక్తులకు ప్రయోజనం కల్పించడానికి కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. లోన్ మారటోరియం ఎవైల్ చేసుకోకుండా..కష్టపడి వాయిదాలు చెల్లించినవారికి రివార్డు ఇవ్వాలని కేంద్రం ( Central Government ) భావిస్తోందని సమాచారం. ముఖ్యంగా 2 కోట్ల లోపు రుణం తీసుకున్నవారందరికీ క్యాష్ బ్యాక్ ( Cash back reward ) ఇవ్వాలనేది ఆలోచనగా ఉందట.


లోన్ మారటోరియం వినియోగించుకోనివారికి ప్రయోజనం చేకూర్చడం పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా కాదని ఐసీఆర్ఏ అంటోంది. 5 నుంచి 7 వేల కోట్లు అవుతుందని అంచనా. ఎందుకంటే మారటోరియంను మెజార్టీ వ్యక్తులు వినియోగించుకున్నారు. అయితే ఇలా చేయాలంటే కసరత్తు మాత్రం పెద్దగానే చేయాల్సి ఉంటుంది. కేంద్రం ప్రకటించిన ఆరు నెలల మారటోరియంలో కొందరు రెండు నెలలు వాడుకుంటే..మరి కొందరు 3 నెలలు వాడుకున్నారు. ఒక నెల వాడుకున్నారు. అందుకే అందరికీ లబ్ది చేకూరేలా పక్కా విధానం రూపొందించే పనిలో ఉన్నట్టు సమాచారం. Also read: Keral Gold Scam: చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ