కరోనావైరస్ ( Coronavirus) వల్ల ఇబ్బంది పడుతున్న భారతీయులకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గుడ్ న్యూస్ చెప్పారు. 2021 ఏడాది ప్రారంభంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ( Covid-19 Vaccine ) అందుబాటులోకి వచ్చేస్తుంది అని తెలిపారు.



వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ముందుగా వృద్ధులు, రిస్కు ఎక్కువగా ఉన్న వారికి, కోవిడ్-19 పేషెంట్స్ కు సేవలు అందించే డాక్టర్స్ కు అందిస్తామని తెలిపారు. 


కోవిడ్-19 వైరస్ ను నివారించే టీకా 2021 జనవరి ఎండింగ్ లోపు సిద్ధం అవుతుంది అని.. దాన్ని ఫిబ్రవరిలో పంపిణికి ఏర్పాట్లు చేస్తున్నాం అని తెలిపారు. ఇక వ్యాక్సిన్ మానవ పరిక్షలు ( Human Trials ) నిర్వహిస్తున్న తరుణంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి.  వ్యాక్సిన్ ను భద్రపరిచే ఖర్చు, ఈక్విడి, కోల్డ్-చైన్ వంటి అంశాలను డిస్కస్ చేస్తున్నట్టు తెలిపారు.