Havoc Floods: భారీ వర్షాలు ఉత్తరాదిలో మహా ప్రళయం సృష్టిస్తున్నాయి. వరద నీటితో జమ్ము కశ్మీర్,, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే వరదల కారణంగా 72 మంది మరణించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరాదిలోని హిమాచల్ ప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, నదులు వరద నీటితో పోటెత్తుుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. బియాస్ రావి, సట్లెజ్, యమునా నదులు మహోగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే బియాస్, యమునా నదులు ప్రమాదకరస్థాయిని దాటేశాయి. ఈ నదులపై నిర్మించిన రిజర్వాయర్లు నిండిపోవడంతో గేట్లను ఎత్తివేసి నీటిని వదిలేస్తున్నారు. 


డ్యాం గేట్లు ెత్తి నీళ్లను ఒక్కసారిగా దిగువకు వదులుతుండటంతో నదీ తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. ఇప్పటికే లక్షలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండ ప్రాంతాల్నించి దిగువకు వస్తున్న వరద ప్రవాహం జల ప్రళయాన్ని గుర్తు చేస్తోంది. వాహనాలు, ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడి రోడ్లు ధ్వంసమయ్యాయి. రాకపోకలు స్థంభించిపోయాయి. కాంగ్రా, బిలాస్ పూర్, సోనల్, షిమ్లా, సిర్మౌర్, ఉనా, హమీర్ పూర్, మండి, కులు మనాలి, కిన్నౌర్, చంబా జిల్లాల్లో అతి భారీ వర్షాలు బీభత్సం రేపాయి. రానున్న మూడ్రోజులు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 


హిమాచల్ ప్రదేశ్‌లో అయితే వరద బీభత్స దృశ్యాలు ఒళ్లు గగుర్పాటు కల్గిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాల్లో ఓ వంతెన కొట్టుకుపోవడం, తునాగ్‌లో మార్కెట్ కొట్టుకుపోవడం ఇందుకు ఉదాహరణ. హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు వెళ్తున్న ప్రయాణీకుల బస్సు  వరద ధాటికి బోల్తా పడింది. ప్రయాణికులంతా బస్సు పైకెక్కి సహాయం కోసం ఎదురుచూశారు. స్తానికుల సహాయంతో ప్రాణాలు రక్షించుకున్నారు. 


Also read: Havoc flood Pics: 5 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద బీభత్సం, ఒళ్లు గగుర్పాటు కల్గించే దృశ్యాలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook