Massive Avalanche In Sikkim: సిక్కింలోని సోమ్‌గోలో హిమపాతం కారణంగా మంగళవారం టూరిస్ట్ బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. మరో 11 మంది గాయపడ్డారు. దాదాపు 80 మంది పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాంగ్‌టక్ నుంచి నాథు లాకు అనుసంధానించే 15వ మైలు జవహర్‌లాల్ నెహ్రూ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు.. ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మంచులో చిక్కుకున్న 22 మంది పర్యాటకులను రక్షించారు. గాయపడిన వారిని గ్యాంగ్‌టక్‌లోని ఎస్‌టీఎన్‌ఎమ్‌ హాస్పిటల్, సెంట్రల్ రిఫరల్ హాస్పిటల్‌లో చేర్పించారు. 


రహదారిని క్లియర్ చేసిన తర్వాత.. అక్కడ ఉన్న 350 మంది పర్యాటకులు, 80 వాహనాలను పంపించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హిమపాతం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. సిక్కిం పోలీసులు, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ సిక్కిం, టూరిజం శాఖ అధికారులు, వాహన డ్రైవర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 


చెక్‌పోస్ట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సోనమ్ టెన్జింగ్ భూటియా మాట్లాడుతూ.. 13వ మైలుకు మాత్రమే పర్యాటకులకు పాస్‌లు జారీ చేస్తారని.. అయితే అనుమతి లేకుండా 15వ మైలు వరకు వెళ్తున్నారని చెప్పారు. ప్రమాద ఘటన 15వ మైలులో చోటుచేసుకుందని తెలిపారు. భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని ఎత్తైన పర్వత మార్గమైన నాథు లా సమీపంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో హిమపాతం సంభవించింది. కొండ కనుమ సముద్ర మట్టానికి 4,310 మీటర్లు (14,140 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది. 


మరోవైపు మంగళవారం సోమ్‌గోలో భారీ మంచు తుఫాను ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాను కారణంగానే టూరిస్ట్ బస్సు అదుపుతప్పి నేరుగా కాలువలో పడిపోయిందని తెలిపారు. మంచుకింద చాలా మంది చిక్కుకుని పోవడంతో మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో లడఖ్ ప్రాంతంలోని టాంగోల్ గ్రామంలో కూడా హిమపాతం సంభవించిన విషయం తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా ఇద్దరు ఆడపిల్లలు మృతిచెందారు. అదే విధంగా గతేడాది ఉత్తరకాశీలో హిమపాతం  సృష్టించిన భారీ విధ్వంసంలో 16 మంది మరణించారు.


Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ సర్టిఫికెట్ బయటపెట్టు: బండి సంజయ్ సవాల్  


Also Read: SSC Question Paper Leak: మరో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook