Hijab Row: కర్ణాటక హిజాబ్​ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. హిజాబ్ తప్పనిసరి కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్లు. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ పిటిషన్​ దాఖలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఏమిటి ఈ వివాదం..


కర్ణాటక స్కూళ్లలో యూనిఫాం నిబంధనలు ఉండగా.. ముస్లీం విద్యార్థినులు హిజాబ్​ ధరించడం ఇటీవల వివాదంగా మారింది. దీనిని వ్యతిరేకిస్తూ కొన్ని విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు హిజాబ్ తొలగించి రావాలని సూచించడంతో వివాదం మరింత ముదిరింది.


స్కూళ్లలో విద్యార్థులు మధ్య గొడవలకు కూడా దారి తీసింది. హిజాబ్​కు వ్యతిరేకంగా హిందూ విద్యార్థులు కాషాయపు కండువా కప్పుకుని క్లాస్​లకు రావడం ప్రారంభించారు. దీనితో ఈ వివాదం విద్యాస్థలు తాత్కాలికంగా మూసేసి.. 144 సెక్షన్ పెట్టేంత వరకు వెళ్లింది.


తిరిగి విద్యా సంస్థలు ప్రారంభమైనా.. కట్టుదిట్టమైన భద్రత నడుమే తరగతులు జరిగాయి. ఈ వివాదంపై ఇరు పక్షాలు కోర్టు మెట్లెక్కాయి. కోర్టులో వాదనలు విన్న తర్వాత తాజాగా తుది తీర్పు వెలువరించింది కర్ణాటక హై కోర్టు. ఇస్లాం ప్రకారం.. విద్యార్థులు హిజాబ్​ ధరించడం తప్పనిసరి కాదని కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకోసం యూనిఫాం మార్చాల్సిన పనిలేదని కూడా వెల్లడించింది. దీనితో ఈ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది.


Also read: Hijab Dispute: ఇస్లాంలో హిజాబ్ ధారణ తప్పనిసరి కాదంటున్న హైకోర్టు, సుప్రీంను ఆశ్రయించే యోచనలో విద్యార్ధులు


Also read: Children Vaccination: రేపటి నుంచే 12-14 ఏళ్ల వారికి కరోనా టీకా- రిజిస్ట్రేషన్ ఇలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook