Hijab issue in Karnataka: హిజాబ్‌, కాషాయ వస్త్రధారణల్లో కర్ణాటకలోని పలు కాలేజీలకు విద్యార్థులు వెళ్లడం.. ఇరు వర్గాల మధ్య ఆందోళనలు చెలరేగడం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎఐఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లిం యువ‌తులు ఎప్ప‌టి నుండో హిజాబ్ ధ‌రిస్తున్నార‌ని ఆయన అన్నారు. అయినా దీనిపై ఇప్పుడు అభ్యంత‌రాలు ఎందుకు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ంటూ ఆయన ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముస్లిం యువ‌తుల‌ను హిజాబ్ ధ‌రించ‌వద్దని చెప్పడానికి మీరు ఎవరంటూ ఆయన అన్నారు. హిజాబ్ వ్య‌వ‌హారంలో క‌ర్నాటక ప్ర‌భుత్వ తీరును ఒవైసీ త‌ప్పుప‌ట్టారు. ముస్లిం యువతులు హిజాబ్ ధ‌రించ‌కుండా అడ్డుకోవ‌డం... వారి రాజ్యాంగ హ‌క్కుల్ని ఉల్లంఘించ‌డం అవుతుందంటూ అస‌దుద్దీన్ ఓవైసీ అన్నారు. 


ఇక హిజాబ్ ధరించి వెళ్లి, నిరసనకారులను ఎదురించి నిలబడ్డ విద్యార్థిని ముస్కాన్ ఖాన్‌కు అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలికారు. ముస్కాన్, ఆమె కుటుంబ సభ్యులతో తాను మాట్లాడాడని ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 


ముస్కాన్ ఆమె మత స్వేచ్ఛను వినియోగించుకుంటూ చదువులో నిబద్ధతగా ముందుకు సాగాలని కోరుతూ ఆమె కోసం ప్రార్థించానని ఎంపీ అన్నారు. ఆమె ధైర్యంగా ముందుకు వేసిన అడుగు.. మనందరికీ ధైర్యాన్ని ఇచ్చిందంటూ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు.


కాగా 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ (ఎస్‌) కోసం  ప్రచారం నిర్వహించే సందర్భంలో ఆమె తండ్రిని కలిశానని ఎంపీ అస‌దుద్దీన్ పేర్కొన్నారు. ఆమె పెంపకం విషయంలో తల్లిదండ్రులను అభినందించానని చెప్పుకొచ్చారు ఒవైసీ.



 


కర్ణాటకలోని మాండ్యాలో పీఈఎస్ కాలేజీకి ముస్కాన్‌ హిజాబ్‌ ధరించి వెళ్లింది. అయితే హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వారంతా అటుగా వచ్చే క్రమంలో ముస్కాన్ కూడా అటు వైపు వెళ్లింది. వారంతా జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తుండగా.. ఈమె అల్లా హు అక్బర్ అంటూ నినాదాలు చేసింది. ఇక సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. 


ఇక తాను టోపీ పెట్టుకుని పార్లమెంట్‌కు వెళ్లగలుగుతున్నప్పుడు.. ఒక ముస్లిం అమ్మాయి హిజాబ్ ధరించి కాలేజీకి ఎందుకు వెళ్లకూడదు? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. అయినా మా ముస్లిం మహిళలు ధరించే వాటితో మీకు ఏం సంబంధం అని ఆయన అడిగారు.


ఒకవేళ మీరు ఏమీ ధరించకుండా ఉండాలి అనుకుంటే అది మీ ఇష్టం.. అలాగే చేసుకోండి, కానీ మా జోలి మాత్రం రాకండి అని కోరారు. ప్రజలకు వారికి నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు. 


ఇక హిజాబ్ వివాదంలో పాకిస్తాన్ త‌ల‌దూర్చగా.. అస‌దుద్దీన్ ఒవైసీ ఆ దేశానికి కౌంట‌ర్ ఇచ్చారు. మీ ప‌ని ఏదో మీరు చూసుకోండి.. మా విష‌యాల్లో త‌ల‌దూర్చ‌కండి అంటూ ఒవైసీ హెచ్చరించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మ‌హ్మ‌ద్ ఖురేషీ చేసిన ట్వీట్‌పై ఒవైసీ అలా స్పందించారు. హిజాబ్ ధ‌రించడం వల్ల మ‌హిళ‌ల్ని విద్య నుంచి దూరం చేయాలనే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయంటూ ఖురేషీ చేసిన ట్వీట్‌కు ఒవైసీ కౌంటర్‌‌ ఇచ్చారు.


Also Read: Sampreeti Yadav: 24 ఏళ్లకే 50 ఇంటర్వ్యూలు.. చివరికి గూగుల్‌లో కోటి రూపాయల ఉద్యోగం!!


Also Read: Modi on AP Bifurcation: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తీరుపై ప్రధాని మోదీ స్పందన.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook