Modi on AP Bifurcation: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తీరుపై ప్రధాని మోదీ స్పందన.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు

Modi on AP Bifurcation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఇప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఆనాడు ఏపీ పునర్విభజన బిల్లుపై సరిగ్గా చర్చించి ఉంటే ఇంతటి సమస్యలు తలెత్తేవి కావని మోదీ స్పష్టం చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 08:06 PM IST
    • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తీరుపై ప్రధాని మోదీ మండిపాటు
    • ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించారని వ్యాఖ్య
    • అలా చేయడం వల్ల ఇరురాష్ట్రాలు ఎంతో నష్టపోయాయని వెల్లడి
Modi on AP Bifurcation: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తీరుపై ప్రధాని మోదీ స్పందన.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు

PM Modi on AP Bifurcation: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పార్లమెంట్ వేదికగా మరోసారి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన గురించి మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పునర్విభజన తీరుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుటికీ నష్టపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ ఈ విధంగా మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చేసే సమయంలో తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ పార్టీ నుంచి ఎంపికైన పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహరీ వాజ్‌పేయీ హయంలోనూ 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ మూడు రాష్ట్రాలు ఏర్పాటు పార్లమెంట్ లో అందరూ కలిసి కూర్చొని, చర్చించి.. ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను ఆమోదించారని మోదీ గుర్తు చేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన చేసే క్రమంలో అలాంటి చర్చకు తావు లేకుండా ఒంటెద్దు పోకడలా విభజన బిల్లుకు ఆమోదించడం జరింగదని పేర్కొన్నారు. 

ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ లో మైకులు ఆపేసిందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు కొందరు పెప్పర్ స్ప్రే కొట్టారని.. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారని మోదీ స్పష్టం చేశారు. 

ఏపీ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు ఇప్పటికీ అనేక నష్టాలను ఎదుర్కొంటున్నాయని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనమని.. ఏపీ పునర్విభజన సరిగ్గా జరిగి ఉంటే ఇంతటి సమస్యలు తలెత్తేవి కావని పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని తెలిపారు.  

Also Read: India corona Update: భారీగా తగ్గిన కరోనా కేసులు- 10 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు!

Also Read: Asaduddin Owaisi Z security: అసదుద్దిన్ ఒవైసిపై కాల్పులు నేపథ్యంలో ఒవైసికి అమిత్ షా రిక్వెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News