Domestic flight charges: మరోసారి పెరిగిన దేశీయ విమాన ఛార్జీలు
Domestic flight charges: డొమెస్టిక్ విమాన ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ వార్త అందించింది. దేశీయ విమానాల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఇటీవలి కాలంలో రెండవసారి విమాన ఛార్జీలు పెరగడం.
Domestic flight charges: డొమెస్టిక్ విమాన ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ వార్త అందించింది. దేశీయ విమానాల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఇటీవలి కాలంలో రెండవసారి విమాన ఛార్జీలు పెరగడం.
కరోనా మహమ్మారి (Corona pandemic) నుంచి కోలుకుని తిరిగి గాడిన పడుతోందనుకునేలోగా పెరుగుతున్న ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న జనం..విమాన ఛార్జీల పెరుగుదలతో మరింత ఇరుకున పడనుంది. దేశీయ విమానాల లోయర్ ఎయిర్‌ఫేర్ బ్యాండ్‌ను 5 శాతం పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రెండవసారి పెరగడం. ఫిబ్రవరి నెలలో ఒకసారి దేశీయ విమానాల ఫేర్ లిమిట్స్ పెంచింది. ఇప్పుడు ఎయిర్‌ఫేర్ బ్యాండ్( Airfare band) పెంచడంతో విమాన టిక్కెట్లు పెరగనున్నాయి. విమానాల ఇంధన ధరలు పెరుగుతూ ఉండటంతో దిగువ స్థాయి ఛార్జీల్ని 5 శాతం (Domestic flight charges) పెంచుకోవచ్చనే నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
రోజువారీ ప్రయాణీకుల సంఖ్య ఒక నెలలో ముూడుసార్లు , 3.5 లక్షలు దాటితే హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్స్ జరిపేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షల రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలనే నిబంధన ఉండటంతో విమాన ప్రయాణీకుల సంఖ్య తగ్గుతోంది. దాంతో ప్రయాణీకులు ప్రయాణాల్ని వాయిదా వేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెలలో ఇంధన వ్యయాల ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) దేశీయ విమాన సర్వీసుల ఎగువ స్థాయి, దిగువ స్థాయి ఛార్జీల పరిమితిని 10-30 శాతం పెంచింది. అయితే గత ఏడాది మే నెలలో విమానయాన శాఖ దేశీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించినప్పుడు దేశీయ విమాన సర్వీసుల రూట్లు, విమానాల ప్రయాణ కాలం అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ఏడు బ్యాండ్లుగా విభజించి ధరలపై పరిమితులు పెట్టింది. మొదటి బ్యాండ్ అనేది 40 నిమిషాల్లోపే ప్రయాణం పూర్తయ్యే విమానం. ఇప్పుడు దాని దిగువ స్థాయి టికెట్ ధర శుక్రవారం నాటికి 2 వేల310 రూపాయలకు చేరింది. ఇక 180 నుంచి 120 నిమిషాల పాటు ప్రయాణించే అత్యధిక స్థాయి విమానాల్లో దిగువ స్థాయి పరిమితి 7 వేల 560కు చేరింది.
Also read: Covid 19 Restrictions: మహారాష్ట్ర, పంజాబ్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook