లఢాఖ్‌లోని గాల్వన్ లోయ(Galwan Valley)లో చైనా, భారత సైనికుల(Indian Army)పై దుశ్చర్యకు పాల్పడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా డ్రాగన్‌ దేశంపై ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. చైనా వస్తువులను, చైనా అప్లికేషన్లను(China Apps) బహిష్కరించాలంటూ బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేటి (జూన్ 23) ఉదయం హిందూసేన కార్యకర్తలు (Hindusena Activists) ఢిల్లీలోని పంచశీల మార్గ్‌లోని చైనా రాయబార కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. తమ జవాన్ల మరణాలపై నోరు విప్పిన చైనా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనా ఎంబసీ సైన్ బోర్డు (China Embassy)పై నల్లరంగు పోస్టర్ ను అంటించి నిరసన తెలిపారు. అయితే ఈ పోస్టర్ పై ‘చైనా దేశద్రోహి అని.. ఇండియా చైనా బాయ్ బాయ్ (hindi cheeni bye bye)’ అని రాసిఉంది.  అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని పోస్టర్ ను తొలగించారు. అయితే పోస్టర్ అతికించిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు చైనా రాయబార కార్యాలయం బయట ఉన్న సీసీ టీవీ కెమెరాను పరిశీలిస్తున్నారు. CoronaVirus కలకలం.. ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్


కాగా, గాల్వన్ లోయల్ చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో తెలంగాణ సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు (colonel santosh babu) సహా 20మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. చైనాతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని, చైనా ఉత్పత్తులు వాడరాదని, చైనా యాప్స్ నిషేధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ