Fire Breaks Out At Ujjain Mahakaleshwar Temple During HOli 2024: హోలీ పండుగ సందర్భంగా దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక సోమవారం ఈ పండుగ రావడంలో చాలా  మంది శివుడి ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శంచుకుంటున్నారు. ఈ క్రమంలో మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారు జామున నుంచి భక్తులు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. శివుడికి పండితులు, భక్తులు భస్మ ఆరతి పూజ చేస్తున్నారు. ఇంతలో భారీగా మంటలు వ్యాపించాయి.అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మంటలు చెలరేగడంతో దాదాపు పదుల సంఖ్యలో భక్తుల తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఆలయం నుంచి బైటకు పరుగులు పెట్టారు. ఏటా శివుడికి హోలీ రోజున భస్మంతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున మహాకాళేశ్వర స్వామివ దర్శనం కోసం పొటెత్తారు. పండితులు భస్మ ఆరతి చేస్తుండగా ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా గర్భగుడిలో మంటలు వ్యాపించాయి.


Read More: Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వైరల్ గా మారిన వీడియో..


దీంతో భక్తులు మంటలకు తీవ్రంగా గాయపడ్డరు. దాదాపు 13 మంది వరకు భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే ఆలయ సిబ్బంది అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గాయపడిన భక్తులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. హోలీ పండుగ రోజు, అది సోమవారం శివుడి ఆలయంలో ఇలాంటి ఘటన జరగటంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నీరజ్ సింగ్ డాక్టర్లకు సూచించారు. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook