ఇండో పాక్ సరిహద్దుల్లో  యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో  కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. నార్త్ బ్లాక్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఎన్ఎస్ఏ, రా చీఫ్ లతో పాటు పాటు హోమ్ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో అంతకుముందు రాజ్ నాథ్ ఆంతరంగిక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమావేశంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన యద్ధప్రాతిక చర్యలను సమీక్షించారు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత భారీ ఎత్తున జైషే ఉగ్రవాదమూకలు భారత్ లో కి చొరపడినట్లు నిఘావర్గాల నుంచి సమాచారం అందడంతో భారత సైన్యాన్ని మరింత అపమత్రం చేసింది. ఈ భేటీలో పాక్ యుద్ధ విమానాలు భారత భూభాంగంలోకి రావడం...ఓ విమానాన్ని కూల్చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఇప్పటికే సరికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన దూకుడుగా వ్యవహరిస్తున్న భారత్ ..మరోవైపు రక్షణ చర్యలను సైతం ముమ్మరం చేసింది. ఒకవైపు కశ్మీర్ లో యాన్టీ టెర్రరెస్ట్ ఆపరేషన్ చేపడూతూనే మరోవైపు సరిహద్దుల్లో పాక్ సైనికులను మట్టుబెడుతోంది. ఈ క్రమంలో రక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసే క్రమంలో ఈ సమావేశం నిర్వహించారు.