Rajiv Gandhi Foundation: ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం (Central govt) దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (Home Ministry) ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నాయకత్వం వహించనుంది. ఈ ట్రస్ట్‌లను పీఎంఎల్ఏ (PMLA), ఆదాయపు పన్ను చట్టం, ఎఫ్‌సీఆర్ఏ (FCRA) చట్టం కింద దర్యాప్తు చేయనున్నారు. Also read: Covid-19 First Vaccine: కరోనావైరస్ తొలి వ్యాక్సిన్ ఇతనికే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలలను నెరవేర్చేందుకు 1991 జూన్ 21 న రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ ట్రస్ట్‌కు సోనియాగాంధీ ఛైర్ పర్సన్‌గా ఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, చిదంబరం ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ బాధ్యతలను సోనియా గాంధీ నిర్వహిస్తున్నారు. అయితే యూపీఏ ప్రభుత్వ హయాంలో 2005-2008 మధ్య పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నగదు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా చైనా నుంచి కూడా పెద్ద మొత్తంలో నగదు అందుకున్నట్లు ఇటీవల బీజేపీ అధ్యక్షుడు నడ్డా సైతం ఆరోపించారు. Also read: Rahul Gandhi: వాటికి సమాధానాలు చెప్పండి: రాహుల్ గాంధీ


ఇదిలాఉంటే భారత్, చైనా సరిహద్దు వివాదంపై కొన్ని రోజులుగా కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటలయుద్ధం కొనసాగుతూ వస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలుమార్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు సైతం చేశారు. ఈ క్రమంలోనే గాంధీ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. Also read: coronavirus: మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టండి


 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..