ఆ ఐదుగురికి మరో వారం రోజులు గృహ నిర్బంధమే: సుప్రీం కోర్టు
మరో వారం రోజులు గృహ నిర్బంధం
మావోయిస్టులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతోపాటు భీమా కోరేగావ్ హింస కేసుతో సంబంధాలున్నాయనే అభియోగాల కింద మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిని గృహ నిర్బంధంలో ఉంచాలని గత బుధవారం స్పష్టంచేసిన సుప్రీంకోర్టు నేడు వారి గృహ నిర్బంధం కొనసాగింపుపై పునసమీక్షించింది. ఈ సందర్భంగా ఆ ఐదుగురిని సెప్టెంబర్ 12 వరకు గృహ నిర్బంధంలోనే ఉంచాల్సిందిగా సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఈమేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశాలు జారీచేశారు.