Uddhav Thackeray: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మహా వికాస్ అఘాడీ కూటమి కూలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు శివసేన నుంచి ఒక్కోక్కొకరు బయటకు వెళ్తున్నారు. దీంతో అక్కడి రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈక్రమంలో ఆ రాష్ట్రం సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని..తన సొంత ఇళ్లు మాతోశ్రీకి వెళ్లిపోతున్నానని తెలిపారు. అవసరమైతే పార్టీ నాయకత్వం నుంచి కూడా తప్పుకుంటానని తేల్చి చెప్పారు. అధికారం కోసం తాను పాకులాడలేదని..రెబల్ ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు మహారాష్ట్ర సీఎం. శివసేన ప్రజా ప్రతినిధులు సూరత్ వెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఏంటన్నారు.


ఏదైనా సమస్య ఉంటే తన ముందుకు రావాలని..రాజీనామా కోరితే వెంటనే ఇచ్చేస్తానన్నారు ఉద్ధవ్ ఠాక్రే. శివసేన విధానం ఎప్పటికే హిందూత్వమేనని..ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల కాంగ్రెస్‌, ఎన్సీపీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వివరించారు. మంత్రి ఏక్‌నాథ్‌ శిండేతో వెళ్లిన ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయని..తమను బలవంతంగా తీసుకెళ్లారని వారంతా వాపోతున్నారని ఠాక్రే వెల్లడించారు.


తాను బాల్ ఠాక్రే కుమారుడినని..పదవుల కోసం వెంపర్లాడనని తేల్చి చెప్పారు ఠాక్రే.సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇలా చేస్తే ఎలా అని..శివ సైనికులంతా తనతో ఉన్నంత కాలం భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు మంత్రి ఏక్‌నాథ్‌ శిండే వేగంగా పావులు కదుపుతున్నారు. తమదే అసలైన శివసేన అంటూ 30 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాశారు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్‌ను గుర్తించాలని లేఖలో కోరారు. లెటర్‌పై మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఇందులో నలుగురు స్వతంత్రులు ఉన్నారు.



Also read: Green India Challenge: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలి..బాలీవుడు నటుడు సల్మాన్‌ఖాన్‌ పిలుపు..!


Also read:UPSC Prelims Result-2022: సివిల్స్‌-2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల..అభ్యర్థులు వీరే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.