Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్‌..సీఎం ఠాక్రేకు పాజిటివ్..ఏం జరగబోతోంది..!

Uddhav Thackeray: మహారాష్ట్రలో పాలిటిక్స్‌ రంజు మీద ఉన్నాయి. రోజుకో మలుపులు తిరుగుతున్నాయి. శివసేనలో తిరుగుబాటు చినికి చినికి గాలి వానగా మారింది. మహా వికాస్ అఘాడీ కూటమి చివరి అంచుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 22, 2022, 02:21 PM IST
  • మహారాష్ట్రలో హాట్‌ హాట్‌గా పాలిటిక్స్‌
  • చివరి అంచుల్లో మహా వికాస్ అఘాడీ కూటమి
  • సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్‌..సీఎం ఠాక్రేకు పాజిటివ్..ఏం జరగబోతోంది..!

Uddhav Thackeray: మహారాష్ట్రలో పాలిటిక్స్‌ రంజు మీద ఉన్నాయి. రోజుకో మలుపులు తిరుగుతున్నాయి. శివసేనలో తిరుగుబాటు చినికి చినికి గాలి వానగా మారింది. మహా వికాస్ అఘాడీ కూటమి చివరి అంచుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం ఉద్దవ్ ఠాక్రే సైతం రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఆయన కరోనా బారిన పడటం చర్చనీయాంశంగా మారింది.  

సీఎం ఉద్దవ్ ఠాక్రే.. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ వెల్లడించారు. కరోనా కారణంగా ఠాక్రేను తాను కలవలేకపోతున్నానని ప్రకటించారు. దీంతో సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామాపై గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఠాక్రే కరోనాతో బాధపడుతున్నా..వర్చువల్‌గా కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ మీటింగ్ తర్వాత శివసేన ముఖ్య నేతలతో ఉద్దవ్ ఠాక్రే మరోసారి వర్చువల్‌ గా సమావేశం అవుతారని తెలుస్తోంది. ఆ భేటీ అనంతరం సీఎం పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌ సింగ్ కోశ్యారీ సైతం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇటు శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్‌ శిండే కూటమిలో  చేరే వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వారి శిబిరంలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్దవ్ ప్రభుత్వం కూలడం ఖాయంగా కనిపిస్తోంది. ఈక్రమంలోనే అసెంబ్లీని రద్దు చేసి..ప్రజల్లోకి వెళ్లాలని శివసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన ట్వీట్ సైతం ఇదే చెబుతోంది. మరోవైపు మంత్రి ఆదిత్య ఠాక్రే..ట్విట్టర్‌లో తన స్టెటస్‌ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

Also read: Virat Kohli Covid-19: షాకింగ్ న్యూస్.. విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్‌! భారత్, ఇంగ్లండ్‌ టెస్ట్‌ జరిగేనా?

Also read:Rain Alert: వేగం పుంజుకున్న నైరుతి గాలులు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News