ICMR Recruitment 2020: ఉద్యోగాల భర్తీకి ఐసీఎంఆర్ నోటిఫికేషన్
ICMR Jobs 2020 : భారత కేంద్ర ప్రభుత్వ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ విధులు నిర్వహిస్తుందని తెలిసిందే. రెండు రకాల సైంటిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. సైంటిస్ట్ D, సైంటిస్ట్ E విభాగాలలో మొత్తం 65 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) న్యూఢిల్లీ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగాల (Jobs 2020)కు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత కేంద్ర ప్రభుత్వ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ విధులు నిర్వహిస్తుందని తెలిసిందే. రెండు రకాల సైంటిస్ట్ పోస్టుల భర్తీ (ICMR Recruitment 2020) ప్రక్రియ మొదలైంది. సైంటిస్ట్ D, సైంటిస్ట్ E విభాగాలలో మొత్తం 65 పోస్టులు భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు 65 (ICMR Jobs 2020)
1) సైంటిస్ట్-D: 22
2) సైంటిస్ట్-E: 43
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 6
- దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 5
- దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి
- సెలక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులు
ICMR Notification (ఐసీఎంఆర్ నోటిఫికేషన్)
ఆయా పోస్టులను ఆధారంగా అభ్యర్థులకు పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. టీచింగ్/ రిసెర్చ్ అనుభవం అంటే ప్లస్ పాయింట్. వయోపరిమితి విషయానికొస్తే సైంటిస్ట్ - E పోస్టులకు 50 ఏళ్లు మించరాదు, సైంటిస్ట్ - D పోస్టులకు 45 ఏళ్ల లోపు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe