ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) తయారీలో బిజీబిజీగా ఉన్నాయి. అయితే భారత్ అందరికంటే ముందుగా వ్యాక్సిన్ తెచ్చేలా ఉందని, దేశంవైపు చూస్తున్న అగ్రదేశాలు సైతం ఉన్నాయి. అయితే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకటించినట్లు నిర్ణీత గడువులోగా కోవిడ్19 వ్యాక్సిన్ (Covaxin) ప్రజలకు అందుబాటులోకి రావడం కష్టమని, అంత తేలికేమీ కాదని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్‌ గులేరియా (AIIMS Director Dr Randeep Guleria) అన్నారు. తెలంగాణలో భారీగా కరోనా కేసులు, ఏడుగురి మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏదైనా వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే.. ముందుగా మనుషులపై సైతం విజయవంతంగా క్లినికల్ ట్రయల్స్ జరగాలని తెలిపారు. ఇందుకోసం కొన్ని నెలల సమయం పడుతుందన్నారు. కోవ్యాక్సిన్ (Covaxin) తయారీ విషయం పక్కనపెడితే, దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే ఎన్నో విషయాలు, ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. భారత్ బయోటెక్, క్యాడిలా, సీరం ఇన్‌స్టిట్యూట్, హెటిరో ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నాయని చెప్పారు. అందరికంటే ముందు మార్కెట్‌లోకి విడుదల చేస్తామని చెబుతున్న భారత్ బయోటెక్ ఆగస్టు 15న మార్కెట్‌లోకి రావడం అంత తేలికేమీ కాదన్నారు. కరోనా శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. బాధ్యత ఉండక్కర్లేదా?


మనుషులపై ఆ వ్యాక్సిన్ ప్రయోగించాక దాదాపు 80 శాతం మేర రోగ నిరోధకశక్తిని ఇచ్చిందని, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని నిరూపించాల్సి ఉంటుందని రణ్‌దీప్‌ గులేరియా (Randeep Guleria) అభిప్రాయపడ్డారు. మరో 3, 4 నెలల్లో కరోనా కేసులు తగ్గుతాయని అంచనా వేశారు. అయితే ఇప్పట్లో కరోనా వైరస్ పూర్తిగా అంతం కాదని, కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని ప్రజలకు ఆయన సూచించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!