తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో వరుసగా మూడోరోజు భారీగా కరోనా కేసులు (Telangana COVID19 Cases) నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులతో పోల్చితే నేడు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా మరో ఏడుగురు వ్యక్తులు కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.

Last Updated : Jul 5, 2020, 11:00 PM IST
తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు (Telangana COVID19 Cases) తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. జులై2 హెల్త్ బులెటిన్ తర్వాత గత రెండు రోజులుగా స్వల్పంగా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కోవిడ్19 మహమ్మారితో పోరాడుతూ తాజాగా ఏడుగురు చనిపోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  కరోనా శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. బాధ్యత ఉండక్కర్లేదా?

రాష్ట్ర ఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (Telangana Corona Positive Cases) 23,902కు చేరింది. తాజా మరణాలతో కలిపి 295 మంది కరోనా కాటుకు బలైపోయారు. నేడు సైతం కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ (GHMC Corona Cases)లో 1,277 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్‌లో 125, రంగారెడ్డిలో 82, సూర్యాపేటలో 23, మహబూబ్ నగర్‌లో 19, సంగారెడ్డిలో 19, నల్గొండలో 14, కరీంనగర్‌లో 4, వనపర్తిలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

Trending News