Virus Threat: భారత్ కు పొంచి ఉన్న ప్రమాదం, మరో ప్రాణాంతక వైరస్
కరోనా వైరస్ నుంచి ముప్పు ఇంకా తొలగనే లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు ప్రాణాంతక క్యాట్ క్యూ వైరస్ ప్రమాదం భారత్ కు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది.
కరోనా వైరస్( Corona virus ) నుంచి ముప్పు ఇంకా తొలగనే లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు ప్రాణాంతక క్యాట్ క్యూ వైరస్ ( Cat que virus ) ప్రమాదం భారత్ కు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా..రోజురోజుకూ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో వైరస్ ముప్పు భారత్ కు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ వైరస్ కూడా చైనా ( Another virus from china ) నుంచి వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఇప్పటికే చైనాతో పాటు పొరుగుదేశం వియత్నాంలో అనేకమందికి సోకిన ఈ క్యాట్ క్యూ వైరస్ ఇప్పుడు ఇండియాకు వ్యాప్తి చెందే అవకాశముందని భారతీయ వైద్య పరిశోధన మండలి ( ICMR ) హెచ్చరిస్తోంది. ఐసీఎంఆర్ తాజా హెచ్చరికలు భారత్ లో ఆందోళన పుట్టిస్తున్నాయి. సీక్యూవీగా పిలుస్తున్న ఈ వేరస్...క్యూలెక్స్ జాతి దోమలు, పందుల్ని తమ వాహకాలుగా మార్చుకుంటుందనే విషయం చైనా , తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైందని...ఇండియాలో వ్యాప్తి చెందవచ్చని ఐసీఎంఆర్ చెబుతోంది.
ఐసీఎంఆర్ చేసిన అధ్యయనం ప్రకారం ఆర్థ్రోపోడ్-బోర్న్ వైరస్ లలో ఒకటి సీక్యూవీ. ఇది మనిషిలో జ్వరం, మెనింజైటిస్ , చిన్న పిల్లల్లో మెదడు వాపు లాంటి వ్యాధులకు కారణం కావచ్చు. ప్రధానంగా దోమలు సీక్యూవికి గురయ్యే అవకాశం ఉంది. వాటి ద్వారా ప్రజలకు సోకవచ్చు. ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ వైరాలజీ ( NIV-PUNE ) శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా దాదాపు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా..వారందరిలో సీక్యూవి యాంటీ బాడీస్ ( CQV Anti bodies ) కన్పించాయి కానీ వైరస్ లక్షణాల్లేవు. దాంతో కొంతమందగి వ్యాధికి గురయ్యే ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో మరి కొంతమంది శాంపిల్స్ కూడా పరీక్షించాల్సిన అవసరముందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 2014, 2017లో కర్ణాటకకు చెందిన రెండు శాంపిల్స్‌లో ఈ పాజిటివ్ గా తేలింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజెఎంఆర్) తాజా సంచికలో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. Also read: Amnesty International: ఇండియాలో కార్యకలాపాలు నిలిపివేత