ICSE Results 2023: ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ ఐసీఎస్ఈ పదవ తరగతి, 12వ తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలు నేరుగా https://cisce.org/ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. మద్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా ఇప్పటికే సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైపోయాయి. చాలా రాష్ట్రాల్లో స్టేట్ బోర్డ్ నిర్వహించిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురూచూస్తున్న ఐసీఎస్ఈ 10, 12 తరగతి ఫలితాలు ఇవాళ మద్యాహ్నం 3 గంటలకు విడుదలవుతున్నాయి. పరీక్షా ఫలితాల్ని నేరుగా https://cisce.org/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ ప్రకటించింది. 10, 12వ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులు తమ తమ పరీక్షా ఫలితాలను ఇండెక్స్ నెంబర్, యూఐడీను ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. 


ఐసీఎస్ఈ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 


ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cisce.org/ ఓపెన్ చేసి కుడి వైపు ఉన్న Results 2023 క్లిక్ చేయాలి. ఆ తరువాత ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇండెక్స్ నెంబర్, యూఐడీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి షో రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. స్క్రీన్‌పై మీ ఫలితాలు కన్పిస్తాయి. డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.


ఐసీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షా ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. విద్యార్ధులు ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకునేందుకు ICSE టైప్ చేసి స్పేస్ ఇచ్చి నెంబర్ టైప్ చేయాలి. ఈ మెస్సేజ్‌ను 9248082883 కు పంపించాలి. అంతే మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు వచ్చేస్తాయి.


Also read: Karnataka Election Result 2023 Live: ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఫలితాలు.. ఆ 40 స్థానాల్లో టెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook